Fencing decision between ts and ap secretariats made by governor

Fencing decision between, minister harish rao, ap cm chandrababu, TS and AP secretariats, secretariat Fencing decision, governor narasimhan.

Fencing decision between TS and AP secretariats made by governor

గా కంచె పని గవర్నర్ ? బాబు మేం కాదు?

Posted: 07/04/2014 08:45 AM IST
Fencing decision between ts and ap secretariats made by governor

‘‘గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే.. భుజాలు తడుముకున్నట్లు..’’ తెలంగాణ రాష్ట్రం నీటి పారుదాల శాఖ మంత్రి తీరు ఉందని రాజభవన్ లోని ఉద్యోగులు అంటున్నారు. రీసెంట్ గా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు . సచివాలయాల మద్య వేసిన ఇనుపకంచె ఏర్పాటు ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న తెలంగాణ సర్కార్ .. వెంటనే.. నాలుక మడతపెట్టి, గీ కంచె పని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాలనలోనే కంచె పడిందని . మీడియా ముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆవేశంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సచివాలయాల మధ్య ఇనుపకంచె ఏర్పాటు నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిది కాదని, అది గవర్నర్‌ తీసుకున్న నిర్ణయమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల సచివాలయాల మధ్య ఇనుపకంచె వేసి మనుషుల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన భవనాల మధ్య కంచె నిర్మాణం విషయంలో గవర్నరుకు సంబంధం లేదని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ చెప్పడం వల్లనే కంచె నిర్మించినట్లు వస్తున్న వార్తలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. అలా చేయమని గవర్నర్ ఆదేశించలేదని స్పష్టం చేశాయి. దీంతో మంత్రి హారీశ్ రావు చేసిన వ్యాఖ్యల్లో నిజం అనేది కొంచెం కూడా కనిపించలేదని ఇరుప్రాంతాల ఉద్యోగులు అంటున్నారు. మరీ కంచె వివాదం ఎటు పోతుందో చూడాలి.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles