Ap mlas looking for to let boards

shortage of mla quarters, ap mlas face quarters shortage, ap mlas looking for to let boards, ap speaker faces problem in mla quarters allotment

shortage of mla quarters

అద్దె ఇంటికోసం ఎమ్మెల్యేల వేట

Posted: 07/03/2014 01:58 PM IST
Ap mlas looking for to let boards

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కొరత ఏర్పడింది.  దాదాపు 50 మంది ఎమ్మెల్యేలను అద్దె ఇళ్ళల్లో ఉండమని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది.  అందుకు గాను వాళ్ళకు నెలకు రూ.25000.00 ముట్టచెప్తుందనుకోండి.

కేవలం 128 ఎమ్మెల్యే క్వార్టర్సే ఆంద్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు కేటాయించటానికి ఉన్నాయి.  ఎమ్మెల్యేల సంఖ్యేమో 175.  దీనితో శాసనసభ స్పీకర్ కి ఎమ్మెల్యే క్వార్టర్స్ ని కేటాయించటంలో ఇబ్బంది ఎదురౌతోంది.

అయితే మరో సమస్య కూడా ఎమ్మెల్యేలకు ఎదురయ్యే అవకాశం ఉంది.  సామాన్యంగా పోలీసు శాఖలో పనిచేసేవారికి, లాయర్లకి, సినిమాలవాళ్ళకి అద్దెకివ్వటానికి చాలామంది ఇంటి యజమానులు తటపటాయిస్తారు.  అదే సమస్య ఎమ్మెల్యేల విషయంలో కూడా ఎదురైతే అది మరో సమస్య అవుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles