Telangana peoples try to stopped rajinikanth lingaa shooting

Rajinikanth Lingaa shooting, Rajinikanth Lingaa movie, Telangana peoples try to stoppe, Lingaa, anajpur, shooting, Rajinikanth, Anajpur village

Telangana peoples try to stopped Rajinikanth Lingaa shooting

రజనీకాంత్ ‘లింగా’ను అడ్డుకున్న టి-వాదులు

Posted: 07/03/2014 01:30 PM IST
Telangana peoples try to stopped rajinikanth lingaa shooting

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కు .. తెలంగాణ వాదులు సెగ తాకింది. అంటే రజనీకాంత్ నటిస్తున్న లింగా సినిమా షూటింగ్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అనాజ్‌పూర్‌ సమీపంలో... రజనీకాంత్‌ 'లింగా' సినిమా షూటింగ్‌ను అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించారు.

అవును తెలంగాణ ఉద్యమాలు అయిన తరువాత తెలంగాణ ప్రజలు సినిమా షూటింగులను ఎందుకు అడ్డుకుంటున్నారు అనే ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. కానీ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలోని చెవురుల మీద దృష్టి పెట్టి, వాటిపై కొంచెం శ్రద్ద చూపించండని తెలంగాణ ప్రజలకు పిలుపు నిచ్చారు. అందులో భాగంగానే.. తెలంగాణ ప్రజలు చెరువులను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సినిమాలో షూటింగులను అడ్డుకోవటం జరిగిందని తెలంగాణ ప్రజలు అంటున్నారు.

అయితే సినిమా షూటింగుల వల్ల చెరువుల ఎం నష్టం జరుగుతుందని చాలా ప్రశ్నిస్తున్నారు.? కానీ షూటింగ్ వల్ల చెరువులో రసాయన పదార్ధాలు కలుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో చెరువులో నీరు కలుషితమవుతుందని.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు.

మరోవైపు షూటింగ్‌ జరుపుకునేందుకు ఇరిగేషన్‌, గ్రామ పంచాయతీ నుంచి సర్టిఫికెట్‌ తీసుకున్నామని సినిమా సిబ్బంది చెప్తున్నారు. కాగా అంతకు ముందు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బాహుబలి షూటింగ్ ను అడ్డకుంటామని అనాజ్ పూర్ గ్రామస్తులు యత్నించిన విషయం తెలిసిందే.

కొసమెరుపు: తెలంగాణ ప్రాంతంలో షూటింగులు ఎందుకు జరపారని చాలా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ షూటింగ్ పెట్టుకుంటే.. అక్కడ స్థానికులు అడ్డుకుంటారు. అందుకే ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కొత్త ప్రదేశాల్లోకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటామని సినిమా పెద్దలు అంటున్నారు. ఇక కేసిఆర్ సర్కార్ సినిమా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles