Hyderabad metro in trouble

hyderabad metro in trouble, kcr wants underground metro, l & t refuses to go on with a changed design

hyderabad metro in trouble

మెట్రో మీద పీటముడి

Posted: 07/03/2014 11:32 AM IST
Hyderabad metro in trouble

మెట్రో మీద పడింది పీట ముడి, దాన్ని ఇరుపక్కలా లాగటంతో అది ఇంకా బిగుసుకుపోతోంది. ఇదీ హైద్రాబాద్ మెట్రో రైలు పరిస్థితి.

గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ముందుకు పోతామని, డిజైన్ మారితే వ్యయం పెరుగుతుంది కాబట్టి అది సాధ్యం కాదని మెట్రో నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టి వాదన.  

హైద్రాబాద్ చరిత్ర ఇప్పటిది కాదు, చారిత్రాక కట్టడాలకు నష్టం జరగటం సహించం, అటువంటి ప్రాంతాల్లో మెట్రో రైలు భూగర్భంలోంచి వెళ్ళవలసిందేనని తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పట్టుబడుతున్నారు.  ఈ విషయంలో జరిగిన చర్చల్లో ఇవే విషయాలను మాట్లాడుకోవటం జరిగింది కానీ పరిష్కారం వైపు అడుగులు వెయ్యటం జరగలేదు.  

దానితో హైద్రాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఇరుకున పడింది.  

దానితో పాటు కెసిఆర్ ప్రభుత్వం మీద కూడా పారిశ్రామిక రంగంలో విశ్వసనీయత తగ్గే అవకాశం ఉందని కొందరు తెరాస నేతలు అనుమానపడుతున్నట్లు తెలుస్తోంది.  దానితో తెలంగాణాలో పరిశ్రమలను పెంచుదామనుకునే ప్రణాళికలో అడ్డంకి ఏర్పడవచ్చని భయపడుతున్నారు.  అయితే ఆ భయం నిరాధారమైనదని, కేవలం గత ప్రభుత్వం తీసుకున్న అవకతవక నిర్ణయాల వలనే కెసిఆర్ అభ్యంతరాలు తెలియజేస్తున్నారని మరికొందరు అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles