Isis targets india too

isis targets india too, ramzan speech of al badri, al badri commander of the faithful, leader of islamic caliphate

ramzan speech of al badri

భారత్ లక్ష్యంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు

Posted: 07/02/2014 01:01 PM IST
Isis targets india too

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అల్ షామ్ (ఐఎస్ఐఎస్) కమాండర్ ఇబ్రహిమ్ అవ్వాద్ అల్ బద్రి మంగళవారం రాత్రి తన రంజాన్ ఉపన్యాసంలో ఎన్నో దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించారు.  అందులో భారతదేశం కూడా ఉంది.  ఐఎస్ఐఎస్ మొదటిసారిగా భారత్ మీద ప్రకటించిన శత్రుత్వంతో ఇరాక్ లో ఉన్న భారతీయుల భద్రత మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి.  

అబు బక్ర్ అల్ బాగ్ధాది అనే పేరుతో కూడా పిలవబడే అల్ బద్రి ఇస్లామ్ మీద నమ్మకమున్నవారందరినీ పవిత్రమైన ఈ రంజాన్ కాలంలో అల్లాకి శత్రువులైనవారందరినీ చూసినవాళ్ళని చూసినట్లుగా భయోత్పాదం కలిగిస్తూ ప్రాణాలు తీయమని, విశ్వం అంతమౌతున్నదని పిలుపునిచ్చారు.  ఆయన ఉద్దేశ్యంలో ముసల్మానుల హక్కులను కాలరాసిన దేశాలు ఇవి- చైనా, భారత్, పాలస్తీన్, సోమాలియా, అరేబియా, కాకాసస్, షామ్, ఈజిప్ట్, ఇరాక్, ఇండోనేషియా, ఆఫ్గనిస్తాన్, ఫిలిప్పైన్స్, అహ్వాజ్, ఇరాన్, పాకిస్తాన్, తునీషియా, లిబ్యా, అల్జీరియా, మొరాకో దేశాలు.  

జీహాదీలను పురికొల్పుతూ, ఎందరో వితంతువులు, అనాథలు కష్టాలు సహిస్తున్నారని, పిల్లలను పోగొట్టుకున్న తల్లులు రోదిస్తున్నారని, మసీదులలో పవిత్రతకు భంగం కలిగిందని చెప్తూ, ప్రపంచంలో వివిధ దేశాలలోని మీ ముస్లిం సోదరులంతా ఎన్నో కష్టాలు పడుతున్నారని, చిత్రహింసల పాలవుతున్నారని, మీరు చెయ్యబోయే జీహాద్ (అల్లా కి వ్యతిరేకులను తుదమొట్టించటం)  కోసం వాళ్ళంతా ఆశగా ఎదురుచూస్తున్నారని అల్ బద్రి చేసిన ప్రసంగాన్ని అరబిక్ లోనే కాకుండా, ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్, అల్బేనియన్ భాషల్లోకి తర్జుమా చేసి విడుదల చేసారు.  

పోయినవారం అల్ బద్రి తనను తాను అమిర్ అల్ ముమినీన్- అంటే ఇస్లామ్ ని నమ్మేవారి కమాండర్ గాను, త్వరలో స్థాపించబోతున్న ఇస్లామిక్ కాలిఫేట్ కి నాయకుడిగాను ప్రకటించుకున్నారు. 

గత కొద్దికాలంగా ఇరాక్ లో షియా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్న ఐఎస్ఐఎస్ కి అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మద్దతు సంపూర్ణంగా ఉంది.  సున్నీ ముస్లిం వర్గానికి చెందిన ఐఎస్ఐఎస్ షియా ముస్లింలతో సహా ఇతర మతస్తుల మీద శత్రుత్వాన్ని ప్రకటిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles