Mamata benarjee stand on tapas pal

mamata benarjee stand on tapas pal, tapas rape comments, mamatha benerjee helplessness about tapas pal

mamata benarjee stand on tapas pal

వదిలేయటం లేదా చంపేయటం మధ్యలో మరేమీ లేదా?

Posted: 07/02/2014 01:07 PM IST
Mamata benarjee stand on tapas pal

తృణమూల్ కాంగ్రెస్ నాయకుల వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షురాలు, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాటి మీద స్పందిస్తూ, తపస్ పాల్ క్షమాపణ కోరాడు.  ఇంకా నన్నేం చెయ్యమంటారు అతన్ని చంపేయమంటారా అన్నారు.

అంటే, తప్పు చేసినవాళ్ళని దీదీ దృష్టిలో వదిలెపెట్టేయాలి, లేదా చంపిపారెయ్యాలి.  ఈ మధ్యలో మరేమీ లేదన్నమాట.  క్రూరంగా మాట్లాడి మహిళలే కాదు యావద్భారతదేశాన్ని అవమానపాలయ్యే విధంగా వ్యాఖ్యానించిన నటుడు, ఎంపీ తపస్ పాల్ ని సస్పెండ్ చెయ్యాలి, శిక్ష విధించాలి కానీ ఏం చేస్తాం మరి అని మమతా బెనర్జీ నిస్సహాయంగా మాట్లాడటం పార్టీ నాయకులను సమర్థించటాన్ని పలువురు విమర్శిస్తున్నారు.  

రాజకీయాలలో ప్రత్యర్థుల మీద కత్తికట్టటం, వాళ్ళ ఆడవాళ్ళని రేప్ చేయిస్తాననటం రాజకీయం అనిపించుకుంటుందా. మహిళా నాయకురాలైయుండి మహిళ పట్ల అంత ఘోరంగా వ్యాఖ్యానాలు చేసిన ఎంపీని ఏం చేస్తాం అని ఆమె అనటం అందరినీ అబ్బురపరుస్తోంది.  

బంకూరా జిల్లా పార్టీ ఛీప్ ఆరూప్ చక్రవర్తి ఏకంగా, మీ ఇంట్లో మరెవరైనా చొరబడితే వాళ్ళని అడ్డంగా నరికెయ్యండి (బలివ్వండి) ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అని అన్నారు.   ఈ రెండు వీడియోలు గత మూడు
రోజులుగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.  అయితే అవి ఇప్పటివి కావని, ఎన్నికల ముందువని వాళ్ళు అంటున్నారు.  నిజానికి ఆ మాటలు ఎప్పుడు మాట్లాడారన్నది సరిగ్గా గుర్తు చేసుకోలేక సతమతమయ్యారు కాసేపు.  ఆ వీడియో ఫుటేజ్ లను తృణమూల్ కాంగ్రెస్ ని బలహీనపరచేందుకే నెట్ లో పెట్టారన్నది నిస్సందేహంగా తెలుస్తూనేవుంది.  కానీ అది ఎప్పుడు జరిగినా, ఏ సందర్భంలో మాట్లాడినా బహిరంగంగా మాట్లాడిందే, మాట్లాడిన ఉద్దేశ్యమేమిటో స్పష్టంగానే ఉంది.  అందువలన ముందుగా తపస్ పాల్ భార్య నందిని తన భర్త మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పటం, ఆ తర్వాత తపస్ పాల్ కూడా తప్పనిసరి పరిస్థితిగా భావించి క్షమాపణ చెప్పటం జరిగింది.  

ఏమైనా రాజకీయ నాయకులు బహిరంగంగా చేసే ప్రసంగాలలో ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పటం కేవలం వాళ్ళు, వాళ్ళ పార్టీ సమస్యలో పడతాయని కాదు, ప్రజాప్రాతినిధ్యం వహించే బాధ్యతాయుతమైన నాయకుడిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇతరులను అవమానపరచే మాటలు, దేశ సంస్కృతిని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఎవరికీ తగదు.   సమాచార వ్యవస్థ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి విషయమూ ప్రపంచంలో అందరి దృష్టికీ పోతోందన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి.  

అందుకే, ఈ విషయంలో మమతా బెనర్జీ స్పందన కూడా వివాదస్పదమైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles