Electricity shortage to cover in 3 months ap cabinet resolution

Electricity shortage to cover in 3 months AP Cabinet resolution, AP CM Chandrababu held cabinet meet on Saturday,

Electricity shortage to cover in 3 months AP Cabinet resolution

కొరతలొద్దు, ఇక కోతలొద్దు బాబు నిర్ణయం

Posted: 06/29/2014 10:40 AM IST
Electricity shortage to cover in 3 months ap cabinet resolution

ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కొరతలను పూర్తి చెయ్యాలి కోతలుండొద్దు, అన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్నారు.  మూడు నెలలలో విద్యుత్ కొరతను అధిగమించటానికి ప్రణాళికలు వేసారు.

శనివారం లేక్ వ్యూ అతిధి గృహంలో ఈ అంశం మీద క్యాబినెట్ లో విస్తృత చర్చలు జరిగిన తర్వాత ఇక మీదట పూర్తి స్థాయిలో పరిస్థితి మెరుగుపడేంత వరకు ప్రతి క్యాబినెట్ మీటింగ్ లోనూ విద్యత్ మీద సమీక్ష ఉండాలని, ఈ రంగంలో అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది.  విషయావగాహనకోసం ఎపి ట్రాన్స్ కో, జెన్ కో  ఉన్నతాధికారులను పిలిపించటం జరిగింది.  

తమిళనాడు నుంచి 300 మెగావాట్ల విద్యత్తును కొనుగోలు చేసి ప్రస్తుత విద్యత్ లోటును కొంతవరకు భర్తీ చేస్తూ త్వరలో కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తుతోను, సెప్టెంబర్ కల్లా పూర్తవబోతున్న హిందుజ సంస్థ నుంచి మరో 1000 మెగావాట్ల విద్యుత్ తో రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించాలని, ఈ కన్వెన్షల్ విద్యుదుత్పత్తితో పాటు సోలార్, పవన విద్యుదుత్పత్తిని కూడా అభివృద్ధి చెయ్యలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవటమైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles