Narendra modi speech in suraj kund

Narendra modi speech in suraj kund, Two days training to MPs by PM Modi, Modi workshop in Surajkund to MPs, MPs addressed by PM in Surajkund

Narendra modi speech in suraj kund

సూరజ్ కుండ్ లో ప్రధాని ప్రసంగం

Posted: 06/28/2014 05:41 PM IST
Narendra modi speech in suraj kund

(Image source from: Narendra modi speech in suraj kund)

దేశ రాజధానికి దగ్గర్లో హర్యానాలోని పర్యాటక స్థలం సూరజ్ కుండ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులను సంబోధించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

ముందుగా, మొదటిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు తమను తాము పరిశీలించుకోవలసిందిగానూ తమ విధులను అవగాహన చేసుకోవలసిందిగానూ సూచించారు.  పార్లమెంట్ సభ్యులుగా రావటమనేది చాలా గొప్ప విషయమని, దాన్ని సీరియస్ గా తీసుకోవాలని,  పార్లమెంట్ లోనే కాక బయట కూడా ప్రజలు వాళ్ళ కదలికలను, వ్యవహార శైలిని గమనిస్తున్నారని తెలుసుకోవాలని అన్నారు.  

మనం ప్రతిపక్షం నుంచి అధికార పక్షం లోకి వచ్చామంటే పార్లమెంట్ లో కేవలం ఒక వైపు నుంచి మరోవైపుకి వచ్చి కొన్ని అడుగుల దూరంలో కూర్చోవటం కాదని ఆయన అన్నారు.  కూర్చునే స్థానంలోని ఈ మార్పు చాలా విశేషమైనదని, దాని ఉద్దేశ్యాన్ని అవగాహన చేసుకోవాలని ఎంపీలను కోరారు.  

పార్లమెంట్ లో హుందాగా ఎలా ఉండాలి, ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఏవిధంగా జాగ్రత్త వహించాలి అన్నది మోదీ వాళ్ళకి తెలియజేసారు.  చిన్న చిన్న విషయాలలో కలతచెందవద్దని, నిరంతరం సాగే రాజకీయాలలో ఎప్పుడూ ఆగిపోవటమనేది ఉండదని ఆయన సూచించారు.  

వ్యతిరేక భావాలను పెంచుకోవద్దని, అందరం కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులుగా పనిచేయాలని, సభ్యులందరి లక్ష్యం ఒకటేనని చెప్పిన మోదీ, వీలయితే కొత్తవారితో పరిచయాలు పెంచుకుని పరస్పరం ఒకరినుంచి మరొకరు విషయావగాహన చేసుకునే ప్రయత్నం, కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నాలు చెయ్యాలని అన్నారు.  

భాజపాలో శిక్షణనేది ఏదో ఒక యాంత్రికమైన తంతులాంటిది కాదని చెప్పన మోదీ భాజపా ఏ విధంగా పని చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చిందో వివరించారు.  రాజకీయరంగంలో దురదృష్టవశాత్తూ శిక్షణా కార్యక్రమాలు లేవని, అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాజపా మీద బయటి పార్టీల నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు కూడా వస్తుంటాయని అన్నారు మోదీ.  

సోషల్ మీడియా బాగా ఉపయోగించుకుని పార్టీ సందేశాలను, ఇతర విషయాలను ప్రజలకు తెలియజేయమని, ఆవిధంగా ప్రజలకు దగ్గరవమని కూడా మోదీ భాజపా పార్లమెంటు సభ్యులకు సూచించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles