Cheating case filed against ap minister p narayana

cheating case filed against p narayana, andhra pradesh muncipal minister p narayana, narayana group head p narayana. narayana colleges, narayana schools, tdp muncipal minister p narayana.

cheating case filed against andhra pradesh muncipal minister p narayana.

మంత్రి నారాయణ నమ్మకద్రోహం?

Posted: 06/25/2014 12:45 PM IST
Cheating case filed against ap minister p narayana

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  టీమ్ లో ‘‘నారాయణ సంస్థల అధినేత పి నారాయణ ’’ కి మంత్రి పదవి ఇచ్చిన విషయం తెలిసందే.  ఆంద్రప్రదేశ్  మున్సిపల్  శాఖ మంత్రి గా పి.నారాయణ   సీమాంద్ర ప్రజలకు  సేవల లు గత  20 రోజులు గా అందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు  మంత్రి నారాయణ పై.. ‘‘నమ్మకద్రోహం ’’ అనే మాటలు  విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.

ఇప్పుడు  విజయవాడ పోలీసులు మంత్రి  నారాయణ కోసం  ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికి వరకు పెద్దగా ఎవరికి  తెలియని  మంత్రి నారాయణ.  నమ్మకద్రోహం కేసుతో  అందరికి తెలిసిపోయింది. విశాఖపట్నానికి చెందిన  ఐతా రామలింగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. తన కుమారుడు రామసాయి అనుదీప్ ను 2010 జూన్ లో మొగల్రాజపురంలోని నారాయణ ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ లో 8వ తరగతిలో చేర్పించారు.

అయితే ఇక్కడే అసలు విషయం బయట పడింది. 2011 జూన్ 12న ఫిర్యాది భార్య తొమ్మిదో తరగతికి ఫీజు చెల్లించేందుకు రాగా...ప్రిన్సిపాల్ రూ.90వేలు చెల్లించాలన్నారు. ఏడాదికి రూ.85 వేలకు చొప్పున మూడేళ్లకు మాట్లాడుకున్నాం కదా మళ్లీ ఇప్పుడు పెంచటమేంటని బాధితుడు ప్రశ్నించగా ప్రిన్సిపాల్ స్పందించలేదని  ఆ తల్లిదండ్రులు  కోర్టును  ఆశ్రాయించారు.   విజయవాడ ఒకటవ అదనపు  చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మహ్మద్ రఫీ మాచవరం పోలీసులను  ఆదేశించారు.   నారాయణ ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ సూరయ్యలపై చీటింగ్, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించాలని కోర్టు కోరింది. దీంతో   మంత్రి నారాయణ పై నమ్మద్రోహం కేసు నమోదు అయ్యింది.  

పాపం  రాజకీయల్లోకి అడుగుపెట్టిన వెంటనే.. పోలీసు కేసు నమోదు అయ్యాంది. గతంలో ఇలాంటి అనుభవం మంత్రి నారాయణకు లేదని  ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కేసు పై టిడిపి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles