I have to learn a lot balakrishna

Chandrababu 7 times MLA, 7 times MLA Babu still prepares, Chandrababu does homework before attending Assembly, Babu asks Jagan to prepare before questioning in Assembly

7 times MLA Babu still prepares

బాలయ్యే నయం ఏమీ తెలియదని అన్నారు

Posted: 06/25/2014 11:15 AM IST
I have to learn a lot balakrishna

సినీ నటుడు, మొదటిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి శాసనసభకు వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శాసనసభలో తను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని అన్నారు.  

కానీ ప్రతిపక్షనాయకుడు వైస్ జగన్ తనకి అన్నీ తెలుసన్నట్లుగా మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం.  ఏమీ రాదని అనుకునేవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు.  అన్నిరకాలుగా తయారై వస్తారు.  అంటే హోంవర్క్ చేసుకుంటారు.  కానీ జగన్ శాసనసభకు పూర్తిగా తయారవకుండా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారని చంద్రబాబు శాసనసభలో విమర్శించారు.

తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసానని, అయినా ప్రతిసారీ శాసనసభకు అన్నివిధాలా తయారై వస్తానని, ఏం మాట్లాడాలన్నదానిలో స్పష్టత ఉంటుందని అన్న చంద్రబాబు జగన్ ఒకసారి ఎమ్మెల్యే అయినా మొదటిసారి కూడా ఇంకా ప్రిపేరై రాకపోవటాన్ని ఆయన తప్పు పట్టారు. ఏదైనా ప్రశ్న అడిగేముందు ఊరికే అడిగామని కాకుండా ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుని వస్తే మంచిదని చంద్రబాబు జగన్ కి సలహా ఇస్తూ, అయినా ప్రశ్నలు అడగటానికి ఇంకా సమయం ఉందని, ముందున్నది ముదుసళ్ళ పండుగని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles