Governor narasimhan first speech in andhra pradesh assembly

governor narasimhan first speech in ap, andhra pradesh assembly, governor narasimhan, andhrapradesh and telangana states governor narasimhan, governor narasimhan speech in ap assembly and council,

governor-narasimhan-first-speech-in-andhra-pradesh-assembly

అబ్బ.. గవర్నర్ కు గాయం అయ్యిందా?

Posted: 06/21/2014 10:19 AM IST
Governor narasimhan first speech in andhra pradesh assembly

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈరోజు రుచి లేని ఉప్మా మాటలు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. రాష్ట్ర విభజన జరిగి, రెండు రాష్ట్రాలు, రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాడిన తరువాత.. మన గవర్నర్ నరసింహన్ కు గాయం అయిందట. గవర్నర్ మాటలు విన్న రాజకీయ నాయకులు, తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారు. గవర్నర్ ముందుగా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్నామని గవర్నర్ తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగిన తీరు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే నా మనుసు చాలా గాయపడిందని అన్నారు. జీవితంలో సంక్షోభాలను ఎదుర్కొవాలని, గత దశాబ్దాల కాలంలో రాష్ట్రం ఎన్నో అవకాశాలు కోల్పోయిందని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60కి పెంచామన్నారు. బీసీలకు ప్రత్యే బడ్జెట్ అమలు చేస్తామని, ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు. కాగా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రసంగించారు.

ఎంతైన మన గవర్నర్ నరసింహన్ లో తమిళ ప్లేవర్ బాగా ఉంది కాబట్టే, రాష్ట్రం విడిపోతున్న సమయంలో కేంద్రంలో ఉన్న చిదంబరం స్వామికి భజన చేయటమే సరిపోయింది. అయినా గవర్నర్ గారు.. మీ మనసు ఎంత గాయం అయిందో తెలుగు ప్రజలకు బాగా తెలుసు.

అసలు చిదంబరం ప్లాన్ కు .. ఆజ్యం పోసింది మీరే అనే విషయం అందరికి తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో.. మీరు రాసిన లేఖలు, రహస్య చర్చలు తెలుగు ప్రజలకు బాగా తెలుసు. అయిన మీకు అయిన గాయానికి ఆనాడే సోనియా గాంధీ మందు రాసింది. ఇంకెక్కడ గాయం ..ఎప్పుడో మాయమైంది. తెలుగు ప్రజల చెవుల్లో తమిళ పువులు పెట్టకండి గవర్నర్ సార్.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles