Indians money swelling in swiss banks

Indians money swelling in Swiss Banks, SNB data shows increase in Indian money, Swiss national bank declares Indians money increase, Indian Govt efforts to get back black money

Indians money swelling in Swiss Banks

స్విస్ బ్యాంక్ లో తెగవాచిన భారతీయుల నిల్వలు!

Posted: 06/19/2014 05:14 PM IST
Indians money swelling in swiss banks

"ఇంటికన్న స్విస్ పదిలం" అని దేశంకాని దేశంలో భారతీయులు సొమ్ము దాచుకుంటున్నారు.   స్విస్ బ్యాంక్ అధికారులు చేసిన ప్రకటన ప్రకారం అందులో భారతీయుల నిల్వలు 40 శాతం పెరిగాయి.  

స్విట్జర్లాండ్ లోని సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీయైన స్విస్ నేషనల్ బ్యాంక్ ఈరోజు విడుదల చేసిన డేటా ప్రకారం స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల్లో నిల్వలు 2013 లో 2 బిలియన్ స్విస్ డాలర్లకు, అనగా 14000 కోట్లకు చేరాయి.

విచిత్రమేమిటంటే భారతీయుల నిల్వలను కాసేపు పక్కకు పెడితే వాళ్ల బ్యాంకుల్లో ఉన్న విదేశీయుల నిల్వలు గరిష్ట స్థాయిలో పడిపోయాయి.  2013 సంవత్సారాంతానికి స్విస్ బాంక్ లలో ఉన్న విదేశీ ఖాతాదారుల నిల్వలు కేవలం 90 లక్షల కోట్లే.  అదే 2012 లో చూస్తే భారతీయుల నిల్వలు గరిష్టస్థాయిలో మూడోవంతుకి పడిపోయాయి.  అంటే 2013 లోనే చకచకా పెరిగిపోవటానికి కారణం మనదేశంలో ఎన్నికల వాతావరణం పెరగటం, ఎన్నికల ఫలితాల అంచనాలు ప్రచారంలోకి రావటం కారణం అయ్యుండాలి.  అంతకంటే గొప్ప మార్పు మనదేశంలో ఏమీ జరగలేదు అలా ఉన్నట్టుండి భారతీయ ఖాతాల్లో నిల్వలు తెగవాచిపోవటానికి.

స్విస్ బ్యాంక్ లలో ఉన్న ఖాతాల వివరాలు తెలియజేయాలంటూ భారతదేశం నుంచి ఒత్తిడి పెరుగుతూ, అందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం నుంచి అందుకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో జ్యూరిచ్ లోని స్విస్ నేషనల్ బ్యాంక్ ఈ డేటా విడుదల చేసింది.  ఈ నిల్వలను స్విస్ బ్యాంక్ తన లయబిలిటీస్ గా లేదా క్లయింట్ లకు తిరిగి ఇవ్వవలసిన సొమ్ముగా బ్యాంక్ లు పేర్కొన్నాయి.  స్విస్ బ్యాంక్ లలో విదేశీ క్లయింట్లకు తిరిగి ఇవ్వవలసిన సొమ్ము గణనీయంగా పడిపోవటానికి కారణం ఆ బ్యాంక్ లు తమ దేశంలో క్లయింట్లను పెంచుకునే దిశగా కొనసాగిస్తున్న ప్రయత్నాలేనని ఆ బ్యాంక్ అధికారులు అన్నారు.  

గోప్యతే ప్రధానంగా ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న స్విస్ బ్యాంక్ లు ఆ దేశంలో 283 ఉన్నాయి.  అందులో పెద్ద బ్యాంక్ లు రెండు, విదేశ సంస్థల నియంత్రణలో ఉన్న బ్యాంక్ లు 93 ఉన్నాయి.  స్విస్ బ్యాంక్ ల మీద అన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధపడ్డ అమెరికా దేశవాసుల నిల్వలు కూడా 2013 లో పెరగటం విశేషం.  

భారత దేశంలో అవినీతితో కూడబెట్టిన ధనమంతా స్విస్ బ్యాంక్ లతో సహా విభిన్న దేశాల లోని బ్యాంక్ ఖాతాలలోకి వెళ్తున్నాయని, దాన్ని అరికట్టాలని, ఉన్న ధనాన్ని వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం సర్వవిధాలా కృషిచేస్తోంది.  స్విస్ నేషనల్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2013 లో భారతీయుల నిల్వలు 13650 కోట్ల రూపాయలు పెరిగాయి.  

భారతీయుల తరఫున ప్రైవేట్ సంస్థలు, భారతీయ కుటుంబాల తరఫున స్విస్ బ్యాంక్ లలో ఖాతాలను నియంత్రించే ఫిడ్యూసరీ ఖాతాలలో సొమ్మ మాత్రం 550 కోట్ల రూపాయలు కిందకు పడిపోయిందట.  ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి స్విస్ బ్యాంక్ ఖాతాలలోని వివరాలను ఆయా దేశ ప్రభుత్వాలకు ఇవ్వవలసిందిగా ఒత్తిడి పెరిగిపోతోంది.  సెబి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేగ కళ్ళతో భారతీయుల సొమ్ము విదేశ బ్యాంక్ లలోకి వెళ్ళటాని పరిశీలిస్తున్నాయి.  సుప్రీం కోర్టు ఆధీనంలో విదేశాలలో ఉన్న నల్లధనం మీద దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను నియమించటం జరిగింది.  

దేశంలో ప్రభుత్వానికి రావలసిన పన్ను చెల్లించకుండా విదేశాలలో డబ్బు దాచుకోవటం పట్ల మాజీ ఆర్థిక మంత్రి కూడా అనేకమార్లు స్విస్ బ్యాంక్ లకు ఆయా బ్యాంక్ లలోని భారతీయుల ఖాతాల వివరాలు తెలియజేయమని లేఖలు రాసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles