Chinese dog eating festival

Chinese dog eating festival, Yulin tradition to eat dog, Dog eating festival in China, Chinese dog eating festival on solstice

Chinese dog eating festival

శునక భక్షణ పండుగ- చైనీయుల ఆచారం

Posted: 06/19/2014 11:15 AM IST
Chinese dog eating festival

చైనా దేశస్తుల వేసవికాలపు పండుగ కుక్కలను చంపి తినటం.  అది మామూలుగా అతి పెద్ద పగలు ఉన్న రోజున జరుగుతుంది.  ఆ రోజు నిజానికి శనివారం పడుతున్నా, కొందరు చైనా దేశస్తులు యూలిన్ పట్టణంలో ముందుగానే ఈ పండుగను చేసుకోవటానికి కారణం- గత సంవత్సరాలలో ఈ పండుగ మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత రావటం, జంతు పరిరక్షణ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం.  సోషల్ మీడియా సభ్యులు కొందరు కుక్కల వధశాలలను, వాటిని విక్రయించే ప్రదేశాలలోను ఆందోళన చేసి రచ్చరచ్చ చేసారు.  ఈ ఆచారానికి వ్యతిరేకంగా పిటిషన్లు వెయ్యటం జరిగింది.  మళ్ళీ అలా జరిగి వేడుకలో భంగం కలుగకూడదనే ఆలోచనతో ఈ సంవత్సరం మూడు రోజుల ముందు నుంచే కుక్కలను భక్షించే పండుగను ప్రారంభించారు.

dog-eating-3

యూలిన్ ఆచారం ప్రకారం సంవత్సరం మొత్తంలో పగటిపూట ఎక్కువగా ఉన్న వేసవి కాలం రోజున కుక్క మాంసంతో పాటు లిచిని తిని మద్యం సేవించినట్లైతే శీతాకాలమంతా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం ఎన్నో సంవత్సరాలుగా వస్తోంది.  కానీ ఆధునికత అలవరచుకున్న ఈ తరం యువత ఈ ఆచారాన్ని ఖండిస్తోంది.  

dog-eating-2

జంతు హక్కుల సంఘాలు ఈ ఆచారాన్ని విమర్శిస్తూ ఇందులో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అన్నారు.  అందుకు కారణం వీధి కుక్కలను పట్టుకుని రావటం, వాటికి అంతకు ముందు రోగాలు ఉన్నాయేమో చూడకపోవటం, దానికితోడు కుక్కలకు ముందు విషపూరిత ఆహారమిచ్చి చంపటం వలన అది దాన్ని తినే మనుషులకు హాని కలిగిస్తుంది కాబట్టి.  పెంపుడు కుక్కలను దొంగిలించి తేవటం కూడా జరుగుతుంది.  

dog-eating-4

ఈ ఆచారం వలన యూలిన్ పట్ల చాలా వ్యతిరేక ప్రచారం జరుగుతోందని ఒక యూలిన్ వాసి వాపోయారు.  కుక్కలను దొంగిలించటం, ఆహారకాలుష్యం, కుక్కలకు సోకే రబీస్ భయం వీటన్నిటితో పాటు ఈ ఆచారాన్ని ప్రోత్సహించేవారు, వ్యతిరేకించేవారుగా జరిగిన విభజన ఇవన్నీ బాధను కలిగిస్తున్నాయన్నారాయన.  

dog-eating-1

అందుకే యూలిన్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.  ఇది అధికారికంగా సమ్మతించిన పండుగ కాదని అంటోంది.  మెనులోను బోర్డ్ లలోను ఉన్న కుక్క మాంసాన్ని తొలగించమని చెప్పటం జరిగింది కానీ  కుక్క మాంస భక్షణాన్ని మాత్రం ప్రభుత్వం నిషేధించలేదు.  

ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకత ఒత్తిడి పెంచటంతో తూర్పు ఝేజియాంగ్ రాష్ట్రంలో వందల సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న కుక్క పండుగను 2011 లోనే రద్దు చెయ్యటం జరిగింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dharmana prasad rao attends official meeting
Unknown persons attack actress kushboo house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles