Dharmana prasad rao attends official meeting

dharmana prasad rao, ys jagan, cbi probe, hyderabad,

The resigned Roads and buildings minister Dharmana Prasad Rao has attended official meeting today after a six months long gap

dharmana prasad rao attends official meeting.png

Posted: 02/08/2013 09:17 AM IST
Dharmana prasad rao attends official meeting

dharmana-prasad-raoజగన్ అక్రమాస్తుల కేసులో నిందుతుడిగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో ఈయన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఇచ్చారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ధర్మాన రాజీనామాను ఆమోదించలేదు. సీబీఐ ఛార్జిషీట్ లో పేరు చేర్చినప్పటి నుండి ధర్మాన తన శాఖకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం లేదు. సీబీఐ విచారణను వేగవంతం చేయడంతో ధర్మాన రాజీనామాను ఆమోదించవచ్చనే ప్రచారం జరిగింది. కానీ ఆయన నిన్న తిరిగి విధులకు హాజరయ్యారు. దర్మాన సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ధర్మానను యథావిధిగా విధులు నిర్వర్తించాలని కోరడంతో ఆయన సచివాలయానికి వచ్చారని అంటున్నారు. దాదాపు ఆరు నెలల తరువాత సచివాలయానికి వచ్చిన ధర్మాన కొద్ది సేపు అక్కడ ఉండి వెళ్లి పోయారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడక పోవడం గమర్హం. ఏది ఏమైనా ధర్మాన కేసును నీరుగార్చి, బుద్దిమంతుడిగా చూపేందుకు ప్రభుత్వం బాగానే కష్టపడుతుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles