Modi government steps to control inflation

Modi Government steps to control inflation, Export duty raised on commodities to curb prices, Curbing rising prices Modi preference

Modi Government steps to control inflation

ధరలు అదుపుకి మోదీ ప్రభుత్వం చర్యలు

Posted: 06/18/2014 01:24 PM IST
Modi government steps to control inflation

ధరలను, దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మోదీ ప్రభుత్వం మంగళవారం చర్యలు తీసుకుంది.  అందులో ఎగుమతుల మీద ఆంక్షలు ఒకటి.  
నిత్యావసర వస్తువుల ధరలు గత ఐదునెలల్లో గరిష్ఠ స్థాయికి చేరుకోవటంతో పాటు బంగాళా దుంపలు, ఉల్లిపాయల ధరలు పెరగటంతో ఇన్ ఫ్లేషన్ ఏప్రిల్ లో ఉన్న 5.20 శాతం నుంచి 6.01 కి పెరిగిపోయింది.  ఎన్నికల ముందు ధరల పెరుగుదల మీదనే నిరసనలు తెలియజేసిన మోదీ దాన్ని నియంత్రించటాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నారు.  

దీనికి తోడు ఈ సంవత్సరం వర్షాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేట్టుగా అంచనాలు రావటంతో కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి.  

మంగళవారం ఈ విషయంలో చర్చించటానికి సమావేశం జరిపిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 22 నిత్యావసర వస్తువుల ధరలను సమీక్షిస్తున్నామని చెప్పారు.  ఉల్లి పాయల ఎగుమతి మీద అంతకు ముందు టన్నుకి 150 డాలర్ల ఎగుమతి సుంకం ఉండగా దాన్ని 300 డాలర్లకు పెంచారు.  అలాగే బంగాళదుంపల ఎగుమతి మీద కూడా సుంకం పెంచుతామని అరుణ్ జైట్లీ తెలియజేసారు.

సమావేశం తర్వాత మాట్లాడిన ఆర్థిక మంత్రి, ధరలు పెరిగింది కొద్దిగానే కానీ దీన్ని ఆసరాగా తీసుకుని (ప్రతిపక్షాలు) అలజడి తీసుకుని వచ్చే అవకాశం ఇవ్వదలచుకోలేదన్నారాయన.  అలాగే మార్కెట్ వైఖరినిబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటామని జైట్లీ అన్నారు.  వాతావరణ సూచన కేంద్రం ప్రకారం జూన్, సెప్టెంబర్ నెలల మధ్యలో వర్షపాతం సగటుకి తక్కువలోనే ఉండే అవకాశం ఉంది.  దానితో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ ల పంట తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది.  దేశంలో 55 శాతం పొలాలు వర్షాధారమైనవే కావటం వలన వర్షపాతం పంటల మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది.  

వర్షపాతం తక్కువగా ఉండబోతున్నదని తెలిసి నిత్యావసర వస్తువులను నిలువజేసే వ్యాపారుల మీద చర్యలు తీసుకోవలసిందిగా అరుణ్ జైట్లీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.  

మొత్తానికి మోదీ ప్రభుత్వం పెరుగుతున్న ధరలను మొగ్గలోనే త్రుంచివేయాలన్న దిశగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles