Ap assembly speaker candidates

AP Assembly Speaker candidates, Chandrababu yet to select Speaker for AP Assembly, Kodela Siva Prasad stands good chances for Speaker, AP Speaker to be proposed

AP Assembly Speaker candidates

మిస్టర్ స్పీకర్ (ఎవరు) సార్?

Posted: 06/18/2014 09:22 AM IST
Ap assembly speaker candidates

ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్ ఎవరన్నది ఇంకా తేలలేదు.  అయితే బరిలో మాత్రం నలుగురు కనిపిస్తున్నారు.  

జూన్ 19 నుంచి శాసనసభ సమావేశాలు మొదలు కానుండగా ఇంకా స్పీకర్ పదవి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదమిద్దంగా ఏమీ తేల్చలేకపోయారు.   రాష్ట్ర మంత్రులుగా వెసులుబాటు చెయ్యలేకపోయిన కొందరు సీనియర్స్ లో ఒకరిని కనీసం స్పీకర్ పదవికైనా ప్రతిపాదించవలసివుంది.  అందులో కోడెల్ శివప్రసాద్, ధూళిపాళ్ళ నరేంద్ర, కె.కళా వెంకట్రావు, కలువ శ్రీనివాసులు, జి.సూర్యారావు. పి.నారాయణస్వామి నాయుడు ఉన్నారు.  

వీరిలో నారాయణస్వామి పేరును ప్రోటమ్ స్పీకర్ గా ప్రతిపాదించటంతో ఆయనను తీసివేయవచ్చు.  కలువ శ్రీనివాసులు రాయలసీమకు చెందినవారు.  కోస్తా ఆంధ్రానుంచే తీసుకోవలసివస్తే ఆయనా వెనక్కి వెళ్ళిపోయినట్లే.  ఇక మిగిలినవారు నలుగురు.  

ఆ నలుగురిలో కళా వెంకట్రావు బంధువు మృణాళినికి ఇప్పటికే కేబినెట్ లో స్థానం దక్కటం వలన ఆయన పేరుని కూడా పక్కకు పెట్టెయ్యవచ్చు.  ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఇప్పటికే తనకి మంత్రి పదవి దక్కనందుకు చాలా ఆగ్రహంతో ఉన్నారు.  కానీ ఆయనకు స్పీకర్ పదవినిస్తే ఇతర సీనియర్లను విస్మరించినట్లవుతుంది.  

ఈలెక్కన మిగిలింది ఇద్దరే.  కోడెల శివప్రసాద్, జి.సూర్యారావు. వీరిద్దరిలో సూర్యారావు మూలాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవి.  కానీ కోడెల్ శివప్రసాద్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి విధేయులన్న పేరుంది.  దానితో పాటు ఆయనకు గుంటూరులో మంచి పేరు, బలం, బలగం కూడా ఉంది కాబట్టి కోడెల శివప్రసాద్ కే స్పీకర్ గా ఎన్నుకోబడటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.  

రెడ్డి వర్గం నుంచి కొందరు స్పీకర్ పదవికి అర్హులైనవారున్నా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఆ వర్గం వారు 30 మంది ఎమ్మెల్యేలున్నారు కాబట్టి వాళ్ళని నియంత్రించటంలో ఇబ్బందులు రావచ్చు కాబట్టి వాళ్ళని పరిగణనలోకి తీసుకోకపోవచ్చు.

పై లెక్క ప్రకారం కోడెల్ శివప్రసాద్ కే ఎక్కువ అవకాశాలున్నాయి.  కానీ ముఖ్యమంత్రికి ఆయన లెక్కలు ఆయనకుంటాయిగా.  వేచి చూద్దాం ఎవరికి స్పీకర్ పదవిని కట్టబెడతారో.

నవ్యాంధ్రకు మొదటి ముఖ్యమంత్రిలా మొదటి స్పీకర్ కూడా చరిత్రలో నిలిపోతారు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles