Narendra modi like to congress party

narendra modi like to congress party, Sitaram Yechury comments on Narendra Modi, pm narendra modi, congress party, bjp, governors, CPI-M leader Sitaram Yechury, Narendra Modi government.

narendra modi like to congress party, Sitaram Yechury comments on Narendra Modi

కాంగ్రెస్ సంస్కృతి పై మోజుపడిన మోడీ?

Posted: 06/18/2014 08:22 AM IST
Narendra modi like to congress party

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అడుగలు కాంగ్రెస్ బాటలోనే పడుతున్నయాన్ని రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. బిజెపి పగ్గాలు చేపట్టినప్పటి నుండి కొన్ని అంశాల్లో ఇది రుజువైందని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా గవర్నర్ల మార్పు తెరపైకి వచ్చింది. గతంలో గవర్నర్ల మార్పుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే బిజెపి గగ్గొలు పెట్టింది. ఇప్పుడు బిజెపి అదే పనిచేయబోతోంది. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు నియమించిన గవర్నర్లు రాజీనామా చేయడం సాంప్రదాయమంటూ ఆ పార్టీ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారు.

బిజెపి లో పదవులు దొరకని నేతలకు పునరావాసం కల్పించే ఉద్దేశంతోనే గవర్నర్లను రాజీనామా చేయమని కోరినట్లు భావిస్తున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి ఇప్పటివరకూ ఏడుగురు కాంగ్రెస్‌ నియమిత గవర్నర్లను రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో.... ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కేరళ గవర్నర్‌ షీలా దీక్షిత్‌ మాత్రం రాజీనామాకు ససేమిరా అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా షీలా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్లను మార్చే సంస్కృతికి బిజెపి చెక్ పెడుతుందని దేశంలోని ప్రజాస్వామ్యవాదులు భావించారు. అయినా బిజెపి కూడా మెల్లమెల్లగా కాంగ్రెస్‌ సంస్కృతినే ఒంటబట్టించుకుంటోందని గవర్నర్ల మార్పు ఉదంతం స్పష్టం చేస్తోంది. నిజానికి ప్రభుత్వాలు మారినపుడు గవర్నర్లు రాజీనామా సమర్పించాల్సిన అవసరం లేదు. 2010లో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.

గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే ఒక గవర్నర్‌ను తొలగించడానికి గల కారణాలను చూపుతూ కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చని మినహాయింపు ఇచ్చింది. కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలా గవర్నర్‌లను మార్చడం మంచి సంప్రదాయం కాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles