Competing cms of two divided states

Competing CMs of two divided states, KCR and Chandrababu compete in showing results, Competition to develop between two divided states

Competing CMs of two divided states of AP and Telangana

పోటా పోటీగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Posted: 06/16/2014 10:26 AM IST
Competing cms of two divided states

మిగులు బడ్జెట్ తో ఒకరు, లోటు బడ్జెట్ తో మరొకరు ఇద్దరూ పోటాపోటీగా జనరంజకంగా పాలిద్దామని నడుం కట్టారు.  

మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణాలో, ఎన్నికల ముందు చేసిన హామీలను నెరవేర్చటానికి పంట ఋణాలకు నిర్వచనమిస్తూ, గత సంవత్సర ఋణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవటం లాంటివి చేస్తుంటే,  విభజనలో హైద్రాబాద్ ఆదాయాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ ఉన్నా, ఆ విషయంలో నిరసనలు రాకుండా జాగ్రత్తపడాలని చూస్తున్నారు చంద్రబాబు.  అందుకే బేషరతుగా రైతుల ఋణమాఫీల మీద సంతకం పెట్టారాయన.  

విభజన జరిగిన రాష్ట్రాలు రెండిటినీ సమానంగా చూడాలని, తెలంగాణాకు కూడా ప్రత్యేక హోదా కావాలి అని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి ప్రయాణం కడితే, కేంద్ర ప్రభుత్వం ముందుగానే చేసిన వాగ్దానం ప్రకారం ఆర్థిక సాయానికి ప్రయత్నిస్తూనే, రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.  అందుకు అన్ని పోర్ట్ లలో గ్యాస్ ప్లాంట్లను స్థాపించాలని, విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని పెంచి తద్వారా ఆదాయాన్ని పెంచాలని ప్రణాళిక వేస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజల మీద పన్ను భారాన్ని పెంచబోమని కూడా ఆంధ్రప్రదేశ్ లోన అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తోంది.  మరో పక్క ఉద్యమ బాటలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఆక్షేపణలు తెలియజేస్తూనే తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, మహిళలు, సామాన్య ప్రజానీకాన్ని సంతృప్తి పరచే విధంగా అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలని కెసిఆర్ ప్రణాళికలు వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండటమే కాకుండా తెలంగాణాలో కూడా తెదేపా ప్రతిపక్షంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో బాబు చేసే పనులకు తెలంగాణాలో కూడా ఆ పార్టీ ప్రతి క్రమక్రమంగా ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కెసిఆర్ తెలంగాణాను అభివృద్ధిచేసే పనిలో పోటీ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ పోటీల్లో ఇరు ప్రాంత ప్రజలకు ప్రయోజన కలిగితే అంతకంటే కావలిసిందేముంది?

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles