Chandrababu starts activities as cm from 19th

Chandrababu starts activities as CM from 19th, Chandrababu CM office Lake view guest house, CM will meet PM on Polavaram issue, funds for Polavaram project, Deficit budget of AP

Chandrababu starts activities as CM from 19th

గురువారం నుంచి బాబు కార్యకలాపాలు ప్రారంభం

Posted: 06/16/2014 09:14 AM IST
Chandrababu starts activities as cm from 19th

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 19 వ తేదీ గురువారం ఉదయం 8.00 గంటలకు అధికారిక ముఖ్యమంత్రి కార్యాలయమైన లేక్ వ్యూ అతిథిగృహం లో బాధ్యతలు చేపట్టనున్నారు.  అదే రోజు నుంచి శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి.  

ఈ లోపులోనే మంత్రులను బాధ్యతలలోకి వెళ్ళమని చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటంతో ఆదివారం ఇద్దరు మంత్రులు బాధ్యతలను చేపట్టారు.  మిగిలిన 17 మంది మంత్రులు సోమవారం నుండి బుధవారం వరకు తమ తమ మంత్రిత్వ బాధ్యతలను చేపడతారు.  

గురువారం లేక్ వ్యూలో 8.00 నుంచి 9.00 గంటల వరకు అవసరమైన దస్త్రాలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. సోమ, మంగళ వారాల్లో చంద్రబాబు తన నియోజక వర్గానికి వెళ్ళి, తనను గెలిపించిన వోటర్లకు కృతజ్ఞతలు తెలియజేసే సభలో పాల్గొననున్నారు.

25, 26 తేదీల్లో ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కావలసిన నిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక లోటు విషయంలో చర్చలు సాగిస్తారు.  అలాగే ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రతిపత్తికి అర్హతలు లేవని చెప్పిన నేపథ్యంలో నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి దాని అమలు కోసం కూడా చంద్రబాబు మాట్లాడనున్నారు.

20 వ తేదీన సభాపతి, ఉపసభాపతి ఎన్నికలు జరుగనున్నాయి.  21 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవరన్న ఇఎస్ఎల్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది.  ఆ తరువాత రెండు రోజులు శాసనసభలో గవర్నర్ ఉపన్యాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలుంటాయి.  చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన సభలో సభ్యులను సంబోధింఛి మాట్లాడుతారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles