Cm k chandrasekhar rao child life history

kcr child history, cm kcr child life story, CM k Chandrasekhar Rao child life history, kcr child friends, Search Results Kalvakuntla Chandrashekar Rao,

CM k Chandrasekhar Rao child life history

అటెండర్ ..కెసిఆర్ చిలిపి చేష్టలు

Posted: 06/12/2014 01:17 PM IST
Cm k chandrasekhar rao child life history

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పదవి కంటే.. అటెంటర్ పోస్టే బాగుంటుందని తన మిత్రులతో చెప్పటం జరిగింది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే.. అప్పుడు కేసిఆర్ జీవిత చరిత్ర మొత్తం ఆయన మిత్రులు బయట పెట్టారు.

‘‘ఛాయ్ వాల దేశానికి ప్రధాని మంత్రి అయ్యాడు. ఒక అటెండర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.’’ కేసిఆర్ చదువుకునే రోజుల్లో స్వపరిపాలన దినోత్సవాల్లో అటెండర్‌గా ఉండడం ఇష్టపడే కెసిఆర్ ఇప్పుడు ఏకంగా సిఎం కావడంపై అతని చిన్ననాటి మిత్రుల ఆనందానికి అవధుల్లేవు. చిన్ననాటి మిత్రులు కెసిఆర్‌ను కలిసేందుకు వెళ్లిన క్రమంలో తాను చదువుకునే రోజుల్లో అటెండర్‌గా స్వపరిపాలనలో పాల్గొన్న ఫొటోను మిత్రులు చూపడంతో చాలా సంతోషపడ్డారని కెసిఆర్ మిత్రులు తెలిపారు.

అప్పుడు అటెండర్‌ను కావడం వల్లే నేను ఇప్పుడు సిఎంను అయ్యానంటూ పాత ఫొటోను చూస్తూ మిత్రులతో కెసిఆర్ సంబరపడ్డాడు.1967-68లో దుబ్బాకలో 9వ తరగతి చదువుతున్న కెసిఆర్ స్వపరిపాలనలో అటెండర్‌గా పనిచేసి గ్రూపు ఫొటోలో కింద కూర్చుండి ఉన్న ఫొటోను చూస్తూ కెసిఆర్ పాత జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్నారు. నాకు చదువుకునేటప్పుడు అటెండర్ అంటేనే ఇష్టం ఉండేదని, అప్పుడు నాకంటే సీనియర్ ఐన దుబ్బాక మాజీ సర్పంచ్ శ్రీరాం వెంకన్న స్పీచ్ ఇస్తుంటే తాను ఆయనకు సరిగా మాట్లాడడం రాదంటూ నవ్వానని, అప్పుడు నన్ను రూంలో వేసి కొట్టాడంటూ గుర్తుచేసు కున్నారు.

kcr-child-life

అందరి యోగ క్షేమాలను కెసిఆర్ అడిగి తెలుసుకున్నారని మిత్రులు తెలిపారు. కెసిఆర్ తన అక్క సుమతితో కలిసి 6నుంచి 10వ తరగతి వరకు దుబ్బాక ప్రభుత్వ హైస్కూల్‌లో చదివారు. చింతమడ్క నుంచి అక్కతో కలిసి కొన్ని రోజులు నడుచుకుంటూ దుబ్బాకకు వచ్చి కెసిఆర్ చదువుకున్నారన్నారు.

అప్పటి గురువు చింతమడ్కకు చెందిన రఘురాంరెడ్డితో కలిసి రూంలో ఉండి చదువుకున్నారని, చిన్నతనంలో కెసిఆర్ చిలిపి చేష్టలు ఎక్కువ చేసేవాడన్నారు. ఏదేమైనా దుబ్బాకలో తమతో పాటు చదువుకొని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ కొలువుదీరడం తమకెంతో గర్వకారణమని కెసిఆర్ మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles