Continuing rapes in up

Continuing rapes in UP, Rapes and murders in UP continuing, Akhilesh Yadav Govt faces rape menace, Violence on women in UP still continues, woman raped in police station

Continuing rapes in UP

యుపిలో ఆగనంటున్న రేప్ లు- పోలీస్ స్టేషన్లోనే....

Posted: 06/12/2014 10:42 AM IST
Continuing rapes in up

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళల మీద అత్యాచారాలు ఆగనంటున్నాయి.  పోలీస్ స్టేషన్లో సీనియర్ పోలీస్ అధికారి 35 సంవత్సరాల మహిళ మీద అత్యాచారం చేస్తుంటే జూనియర్లు అచేతనంగా ఉండిపోయిన సంఘటన వెలుగుచూసింది.

అది ఉత్తర్ ప్రదేశ్ ల హమీర్ పుర్ జిల్లాలోని సుమేర్ పుర్ పోలీస్ స్టేషన్.  అందులోని పోలీసులు నాటు తుపాకీ ఆధీనంలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు.  అతని భార్య అతని కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా స్టేషన్ హౌస్ అధికారి (ఎస్ హెచ్ ఓ) రాహుల్ పాండే ఆమెను లంచం ఇవ్వమని కోరాడు.  అందుకు ఆమె అంగీకరించకపోవటంతో అతను ఆమెను స్టేషన్లోనే రేప్ చేసాడు.  అక్కడే ఉన్న పోలీస్ కాన్ స్టేబుల్స్ కలుగజేసుకోలేదు.  

ఎస్ హెచ్ ఓ ని అరెస్ట్ చేసి కాన్ స్టేబుల్స్ ని విధుల్లోంచి బహిష్కరించటం జరిగింది.  

ఉత్తర్ ప్రదేశ్ లో మంగళవారం నాడు బాహరైచ్ జిల్లా లో రాత్రి పూట ఒక యువతిని చెట్టుకి వేళ్ళాడదీసిన సంఘటన, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బదాఁవు లోని 14, 15 సంవత్సరాల ఆడపిల్లలు ఇద్దరిని సామూహిక అత్యాచారం తర్వాత చెట్లకు వేళ్ళాడదీసిన సంఘటనను పోలివుంది.  

నాటుసారా మాఫియా గురించి పోలీసులకు ఇంతకు ముందే ఫిర్యాదు చెయ్యటం జరిగిందని, వాళ్ళే తన తల్లిని సామూహికంగా రేప్ చేసారని ఆమె కొడుకు తెలియజేసాడు.  ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చెయ్యటం జరిగింది.  అందులో బాధితురాలి మరిది కూడా ఉన్నాడు.  

అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని బర్తరఫు చెయ్యాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles