Modi asks leaders not to discuss rape incidents

Modi asks leaders not to discuss rape incidents, Rapes not to be psycho analyzed PM Says, Prime Minister Modi speech in Loksabha,

Modi asks leaders not to discuss rape incidents

అత్యాచార ఘటనలను విశ్లేషించకండి- నేతలకు మోదీ చురక

Posted: 06/12/2014 09:40 AM IST
Modi asks leaders not to discuss rape incidents

దేశంలో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వివిధ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యానాలకు చెక్ పెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యాచార ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనన విషయంలో తర్జనభర్జనలు, మానసిక దౌర్బల్యాల గురించిన విశ్లేషణను నిలిపివేయమని అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బదాఁవు గ్రామంలో ఇద్దరు బాలికల మీద జరిగిన అత్యాచారం మీద భారతీయ జనతా పార్టీతో సహా వివిధ పార్టీ నాయకులు గత మూడు రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటున్నారు.  అనుకోకుండా ఒక్కోసారి రేప్ లు జరుగుతాయని రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యానాల వలన సమస్య తీరదు సరికదా ప్రజాగ్రహానికి గురౌతారని అన్నారాయన.  ఆడవారి గౌరవానికి మరింత భంగం కలిగించే బదులు అటువంటి సంఘటనల మీద వాదోపవాదాలు చేసుకునే బదులు మనం మిన్నకుండటమే మంచిది అన్నారు మోదీ.    ఆ సంఘటనల ఆధారంగా లోతుగా ఆలోచించటమే మనం చెయ్యవలసిన పని అని అన్నారాయన.

మహిళలతో పాటు మైనార్టీ వర్గాల పరిరక్షణ విషయంలో కూడా మోదీ తన ఆవేదనను వెల్లడించారు.  పూణె లో పోయిన నెలలో ఒక ముస్లిం యువకుడిని మరో వర్గానికి చెందిన బృందం కొట్టి చంపటం లాంటి ఘటనలను కూడా పునరావృతం కాకుండా చూడాలన్నారు మోదీ.  ఛత్రపతి శివాజీ, శివసేన నాయకుడు బాల్ థాకరే బొమ్మలను వికృతీకరించి పంపిణీ చెయ్యటం జరిగింది.  ఆ విషయంలో పై ఘటన చోటుచేసుకుంది. 

తన చిన్నప్పుడు ఒక ముస్లిం యువకుడిని సైకిల్ రిపేర్ చేసుకుంటూ బ్రతుకును వెళ్ళదీయటం తాను చూసానని, ఇప్పుడు అతని కొడుకు కూడా అదే పనిలో ఉన్నాడు కానీ ఆర్థికంగా ఎదగలేదని, అలా ఎందుకు జరుగుతోంది, ప్రభుత్వం ఉన్నది ఉన్నవాళ్ళకోసమేనా, లేని వాళ్ళకోసం కాదా అన్నారు మోదీ.

రాష్ట్రాలలో అభివృద్ధి చాలా ముఖ్యమని, యువతలో ఉపాధికి కావలసిన విద్య, సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యటం అత్యంత అవసరమని మోదీ అన్నారు. యువత క్రియాశీలకంగా మారితే అత్యాచారాలు అంతమవుతాయన్నది మోదీ భావన కాని ఆ విషయాన్ని ఆయన స్పష్టీకరించలేదు.  

లోక్ సభలో బుధవారం సుదీర్ఘంగా ఉపన్యసించిన ప్రధాన మంత్రి మోదీ పై విషయాలను సూచించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles