Sushma swaraj comment on mallikarjun kharge

sushma swaraj comment on mallikarjun kharge, Sushma Swaraj, Congress, BJP, Poll, Modi, Lok Sabha Mallikarjun Kharge,

sushma swaraj comment on mallikarjun kharge

మా సరుకు నచ్చింది కాబట్టే? సుష్మా స్వరాజ్

Posted: 06/12/2014 07:59 AM IST
Sushma swaraj comment on mallikarjun kharge

సరుకు అనే మాటకు అనేక అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకటే అర్థం వస్తుంది. మంచి కోసం మన విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సరుకు అనే పదం పార్లమెంట్ లో ఉపయోగించారు. పార్లమెంట్ సాక్షిగా బిజేపి నేతలను ‘‘కౌరవులతో పోల్చిన’’ కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కు సుష్మా విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ‘సరుకు’ దేశ ప్రజలకు నచ్చలేదని అందుకే మీకు అధికారం ఇవ్వలేదని అన్నారు. మా సరుకు (మోడీ సరుకు) దేశ ప్రజలకు బాగా నచ్చింది కాబట్టి.. మాకు అధికారం ఇచ్చారని సుష్మా స్వరాజ్ అన్నారు. సరుకు బాగుండి, ప్రజలకు నచ్చడంతో బిజెపి ఘన విజయం సాధించిందని వ్యాఖ్యానించింది. "సరుకు బాగుండడాన్నే అందరూ చూస్తారు. అది బాగాలేకపోతే ఎంత మార్కెటింగ్ చేసినా కానీ ఎలాంటి ప్రభావం ఉండదు. నాణ్యత కారణంగానే మా సరుకు ప్రజలకు నచ్చింది" సుష్మా స్వరాజ్ లోక్‌సభలో కాంగ్రెస్ పరువు తీసారు.

sushma-swaraj-vs-mallikarjun-kharge

బిజెపి మార్కెటింగ్, ప్రచారం బాగా చేస్తుందంటూ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యపై సుష్మా స్వరాజ్ స్పందించారు. "మీరు కూడా మార్కెటింగ్ బాగా చేశారు. కానీ మీ సర్కార్‌పై ప్రజలు మండిపడుతున్నారు. అందుకనే ఒక ప్రత్యామ్నాయంగా ప్రజలు నరేంద్ర మోడీకి పట్టం కట్టారు. ప్రజలు కుల, మత, జాతి, వర్గ, ప్రాంతాలకు అతీతంగా మోడీకి ఓటేశారు" అని మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు.

అసలే ధరలు పెరిగి అల్లాడిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ, బిజేపిల సరుకు గోల ఏంటని దేశ ప్రజలు మోత్తుకుంటున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడి నిర్ణయాలు తీసుకోండని ..పార్లమెంట్ కు పంపిస్తే..వీరిలో ఉన్న సరుకు గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఎవరి సరుకు బాగుంది, బాగలేదు అనే విషయం చెప్పాల్సింది మీరు కాదు.. ప్రజలు. అది తెలుసుకోని పరిపాలన సాగించాలని దేశ ప్రజలు చిన్నమ్మను కోరుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles