Tamil nadu cm jayalalithaa to launch amma low cost salt

cm Jayalalithaa to launch Amma low cost salt, Jayalalithaa to launch Amma low cost salt, Jayalalithaa, Tamil Nadu government sops, Amma Unavagam, Amma Drinking Water, Amma Salt, Tamil Nadu Salt Corporation

Tamil Nadu cm Jayalalithaa to launch Amma low cost salt

ప్రతి ఇంటా అమ్మబ్రాండే ఉండాలి?

Posted: 06/11/2014 10:45 AM IST
Tamil nadu cm jayalalithaa to launch amma low cost salt

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత..ఏదీ చేసిన చాలా డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటుంది. ఇటీవల తను కూర్చునే కూర్చీని ..ఢిల్లీకి తీసుకుపోయి, తన రాచరికం ఏమిటో నిరూపించింది. తమిళనాడు ప్రజలకు ‘అమ్మ’ లా మారింది. ప్రజలు కూడా ..‘‘అమ్మ.. అమ్మా.. మాయమ్మ..అమ్మలు కన్న జయమ్మ’’అని పాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటా అమ్మబ్రాండే ఉండాలనే ఉద్దేశంతో కొత్త పథకం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

జయమ్మ ప్రజల్లోకి జెట్ స్పీడ్ తో దూసుకుపోవటంతో.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నిద్రపట్టడం లేదు. తమిళ ప్రజలకు ‘అమ్మ’ పేరిట ఉప్పు ను పరిచయం చేస్తుంది. తమిళ జయమ్మ. ఉప్పు తో తమిళ ప్రజల మనసు జయమ్మ దోసుకోవటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఉప్పు తిన్న విశ్వాసాన్ని ఎవరు మరిచిపోరానే విషయం అందరికి తెలుసు. అందుకే జయమ్మ తమిళ ప్రజలకు అమ్మ ఉప్పు రుచి చూపిస్తుంది.

అమ్మ ఉప్పుతో.. తళమి ప్రజలకు గాలం వేసింది. అంటే తమిళ ప్రజల చేత ఉప్పు తినిపించి, వారి ఓటు హక్కు ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే అమ్మ 5 రూపాయిలకు పుల్ భోజనం తమిళ ప్రజలకు అందిస్తోంది. అమ్మ వాటర్ బాటిల్ కేవలం పది రూపాయలకే దొరుకుతోంది. కాబట్టి వీటికి తోడుగా.. అమ్మ ఉప్పు ను జత చేసినట్లు తెలుస్తోంది.

ఇక కేవలం అతి చౌకధరకు ఉప్పును అందించే విధంగా జయమ్మ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రతి ఇంటిలో అమ్మ బ్రాండ్ తప్పనిసరిగా ఉండే విధంగా... తమిళ నాడులో సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో దొరికే విధంగా తయరు చేసినట్లు తెలుస్తోంది.

కాబట్టి అమ్మ ఉప్పు ప్యాకెట్ ఎవరు కొనుక్కుంటే వారి వంటింటి దాకా జయలలిత(అమ్మ) ప్రవేశించినట్టే. ఓటర్లు ఆమెను ఒక సారి తలచుకున్నట్టే. దీంతో అమ్మ విజయం సులువుగా దక్కుతుందని అమ్మ అభిమానులు చెబుతున్నారు. అమ్మ ఉప్పు తింటే.. ఆరోగ్యానికి, ఆరోగ్యం ఉంటుందని అంటున్నారు.

అమ్మ ఉప్పులో ఉండే రుచే వేరాయా అని తమిళ ప్రజలు చెప్పుకోవాలని జయమ్మ కార్యకర్తలు అంటున్నారు. ఈరోజు ఉప్పు.. రేపు ఏమీ ఇస్తుందోనని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగారం కూడా తక్కువ ధరకు దొరికే విధంగా అమ్మ ఏర్పాటుచేస్తే బాగుంటుందని తమిళ ప్రజలు కలలుకంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles