Seemandhra rule to be started from hyderabad says chandrababu

seemandhra rule, chandrababu, telangana state, CM kcr, seemandhra rule to be started from hyderabad , 2019 election win tdp, 2019 tdp government in telangana, Chandhrabubu naidu, seemandhra cm chandhrababu, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రం, 2019 నాటికి అధికారం, రాజెవ్వడో.. రెడ్డెవ్వడో,

seemandhra rule to be started from hyderabad says chandrababu

రాజెవ్వడో.. రెడ్డెవ్వడో ’ అప్పుడు చూసుక్కోండి?

Posted: 06/07/2014 09:51 AM IST
Seemandhra rule to be started from hyderabad says chandrababu

నారా చంద్రబాబు నాయుడు.. అంటేనే ‘‘శ్రమ, కష్టజీవి, అలుపెరగని..యోదుడు, పట్టువీడని విక్రమార్కుడు, ప్రజల కోసం 207 రోజులు నడిచిన(పాదయాత్ర) నవ యువకుడు’’, పదేళ్లు కఠోర దీక్ష చేసి అధికారం దక్కించుకున్న ఆంద్ర ఆదర్శ నాయకుడు. ఇప్పుడు మరొ కొత్త శపథం చేస్తున్నారు.

సీమాంద్రకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి.. నేను తెలంగాణ నుండే పరిపాలన సాగిస్తాను. అలా ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు విశ్రమించననీ,తాను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అయినా హైదరాబాద్‌ను వదలనని,ఇక్కడ్నుంచే పాలన సాగిస్తానని చంద్రబాబు స్పష్టంచేశారు.

ఇక నుండి వారంలో ఒకరోజు తెలంగాణ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగింది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరైన ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

తెలంగాణలో టీడీపీ బలమైన రాజకీయ శక్తి అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయని, 2019 నాటికి అధికారంలోకి రావడమే కర్తవ్యమని చెప్పారు. ఏమయ్యా.. చంద్రబాబు.. కేసిఆర్ ను ..ప్రశాంతంగా ..నిద్రపోనియ్యవా? ఏందీ? కేసిఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు మంచి సేవలు అందించాలని, బంగారు తెలంగాణ చేయాలని కేసిఆర్ డైరీ రాసుకున్నారు.

నిమ్మలంగా కేసిఆర్, తన గులాబీ దళంతో కలిసి పని చేసుకుంటుంటే, మద్యలో బాబు నీ గోల ఏంటీ? 5 సంవత్సరాల తరువాత జరిగే.. రాజకీయ కంపును.. ఇప్పుడే కెలికి , గులాబీ బాస్ కు నిద్రలేకుండా చేయటం నీకు న్యాయమా? అని గులాబీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ముందు మీరు ప్రజలకు ఇచ్చినే హమీలను సరైన పద్దతిలో నేరవేర్చండి. ‘‘5 సంవత్సరాల తరువాత రాజెవ్వడో.. రెడ్డెవ్వడో ’’ అప్పుడు చూసుక్కోండి!!!

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles