Sumitra mahajan as lok sabha speaker

Sumitra Mahajan as Lok Sabha Speaker, Lok Sabha Speaker BJP candidate Sumitra Mahajan, Mallikharjun Kharge Opposition party leader

Sumitra Mahajan as Lok Sabha Speaker

లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్!

Posted: 06/05/2014 11:50 AM IST
Sumitra mahajan as lok sabha speaker

భారతీయ జనతా పార్టీ సుమిత్రా మహాజన్ (71) ని లోక్ సభ స్పీకర్ పదవికి ప్రతిపాదన చేసింది.  ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ధృవీకరిస్తూ అన్ని పార్టీలకూ ఈ సమాచారాన్ని అందజేసారు.  

స్పీకర్ పదవికోసం నామినేషన్ దాఖలు చెయ్యటానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంది.  కానీ అత్యధిక మెజారిటీ ఉన్న భాజపా అభ్యర్థికే ఆ పదవి దక్కటం అన్నది ఎలాగూ జరిగేదే.  ఇంత వరకు మరెవరి నామినేషన్ నమోదు కాలేదు.  అందువలన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది, కేవలం లాంఛనప్రాయమే అవుతుంది.  

నిజానికి లోక్ సభలో 10 శాతం సభ్యులు లేని కారణంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు.  లోగడ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాం లోకూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ పార్టీకీ లభించలేదు.  కానీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమె తన విచక్షణాధికారాలను ఉపయోగించి అందులో తగు నిర్ణయం తీసుకుంటారని తెలియజేసారు.

అయితే పార్లమెంట్ లో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండాలని భావించే మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడిగార ఎన్నుకున్న మల్లిఖార్జు ఖర్గే కి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం సూచన ప్రాయంగా కనిపిస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles