Formal electing of tdlp leader

Formal electing of TDLP leader, TDLP leader Chandrababu Naidu, TDLP meeting first time at Tirupati,

Formal electing of TDLP leader

టిడిఎల్పీ నాయకుని ఎన్నిక లాంఛనమే!

Posted: 06/04/2014 02:34 PM IST
Formal electing of tdlp leader

భాజపాలో నరేంద్ర మోదీని, తెలుగు దేశం పార్టీలో చంద్రబాబుని, తెరాసలో కెసిఆర్ ని కాక మరెవరిని లోక్ సభ, శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నుకుంటారు? 

ఈ రోజు తిరుపతిలో జరుగునున్న తెలుగు దేశం లెజిస్లేటివ్ పార్టీ నాయకుని ఎన్నికకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.  మధ్యాహ్నం 3.00 గంటలకు హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోబోతున్న చంద్రబాబు పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుని సభాప్రాంగణమైన శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ సెనేట్ హాల్ కి వెళ్తారు.  

హైద్రబాద్ లో కాకుండా ఈసారి బయట జరుగుతున్న టిడిఎల్పీ సమావేశాలకు తిరుపతి పసుపు రంగ వైభవంతో శోభాయమానమైంది.  పట్టణమంతా అలంకరణలు, బ్యానర్లతో టిడిపి ముద్ర వేసుకుని చంద్రబాబుకి స్వాగతం పలకటానికి సంసిద్ధమైంది.

జరిగే తంతంతా లాంఛనప్రాయమే.  టిడిఎల్పీ నాయకుడిగా, ఆటుపోట్లను ఎదుర్కుంటూ తెలుగు దేశం పార్టీని రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి తీసుకునివచ్చిన రథసారధి చంద్రబాబు పేరును కె.ఇ.కృష్ణమూర్తి ప్రతిపాదిస్తారు.  ఆ ప్రతిపాదనను ఇతర ఎమ్మెల్యేలు బలపరచటంతో నాయకుని ఎన్నిక పూర్తవుతుంది.  టిడిఎల్పీ నాయకుని పేరును ప్రకటించటానికి రాత్రి 8.51 కి ముహూర్తం నిర్ణయించటమైంది.  

అంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోతుంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles