Ysrcp conducts postmortem on election defeat

YSRCP conducts postmortem on election defeat, YS Jagan starts searching for reasons for defeat, YS Jagan starts from Rajahmundry to know reasons of defeat

YSRCP conducts postmortem on election defeat

గత జల సేతుబంధనంలో వైకాపా!

Posted: 06/04/2014 03:46 PM IST
Ysrcp conducts postmortem on election defeat

2014 ఎన్నికలలో ఓటమి కారణాలేమిటన్న విషయంలో ఆరా తీయటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు.  పోస్ట్ మార్టం కూడా అవసరమే.  దాని వలన పోయిన ప్రాణాలు తిరిగి దక్కవన్నది నిజమే కానీ, ప్రాణాలు ఎలా పోయాయన్న విషయం తెలుసుకుంటే మరోసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది, జరిగిన దానికి ప్రతిగా కొంత న్యాయం చేసే దిశగా ప్రణాళికలు వేసే వీలు కలుగుతుంది.

2014 ఎన్నికలలో వైయస్ఆర్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  ఎన్నికల ప్రచారానికి విపరీతమైన ఖర్చు కూడా అయింది.  చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్ పాదం మోపటం వలనా మరెందుకు పార్టీ నాయకుల పాదయాత్రలు, ప్రజలకు చేసిన ఎన్నో హామీలు కూడా నిరర్ధకమయ్యాయన్నది పార్టీ తప్పకుండా శోధించవలసిన విషయం.  హైద్రాబాద్ ని మించిన సుందర నగర నిర్మాణం చేస్తామని, విద్యార్థులకు ఆర్థిక సహాయం, మహిళల డ్వాక్రా గ్రూపుల రుణ మాఫీలు లాంటివి ప్రకటించినప్పుడు గుమికూడిన జనం నుంచి చప్పట్లు వచ్చాయి కానీ వోట్లు మాత్రం రాలలేదెందుకన్నది ఆరా తీయవలసిన విషయమే.  అధికారపక్షంలో పనిచెయ్యవలసిన నాయకుడు ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఏర్పడటం శోచనీయమే.  దాని గురించి ఆలోచించటం అవసరమే.  

మార్చి లో ఎన్ డి టివి చేసిన ఒపీనియన్ పోల్ ప్రకారం వైకాపా 15 పార్లమెంటరీ స్థానాలు గెలుచుకోవలసింది.  43 శాతం వోట్లు వైకాపాకే రావలసింది.  అది ఎలా తలకిందులైంది.

ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈ రెండే- తెలుగు దేశం పార్టీ మోదీ మంత్రంతో ప్రభంజనం సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవటం, రెండవది చలనచిత్ర కథా నాయకుడు, జనసేన పార్టీ సంస్థాపకుడు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం.  వైకాపా ఓటమికి ఈ రెండిటిలో ఏదో ఒకటి కారణమా, లేక రెండూ కారణాలా, ఒక వేళ రెండూ అయితే ఏది ఎక్కువ ప్రభావితం చేసింది అన్న విషయాలను తరచి చూడటం కోసం రాజమండ్రి నుంచి మొదలుబెట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోని నియాజకవర్గాల్లో వైయస్ జగన్ స్వయంగా తిరిగి సమీక్షించనున్నారు.  

రాజమండ్రి అతిథి గృహానికి చేరుకున్న జగన్ దానికి ముందుగా ధవళేశ్వరం దగ్గర గోదావరిలో నాటుపడవ మునిగిపోయి మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles