Telangana farmers loans to be written off rs 26000 crore

Telangana farmers loans to be written off Rs.26000 crore, KCR ready to write off farmer loans, Writing off farmer loans to fulfill election assurances

Telangana farmers loans to be written off Rs.26000 crore

తెలంగాణాలో మాఫీ చెయ్యవలసిన రైతు ఋణాలు 26వేల కోట్లు!

Posted: 06/04/2014 09:51 AM IST
Telangana farmers loans to be written off rs 26000 crore

ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్లో ఒకటైన రైతు ఋణ మాఫీ సంపూర్ణంగా చేస్తే రూ.40,994 వేల కోట్ల రూపాయలకు లెక్క తేలుతుంది.  కానీ లక్షరూపాయల లోపున్న ఋణాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని తీసుకున్న నిర్ణయం వలన ఆ మొత్తం ఇప్పుడు 26,020 కి తేలింది.  ఋణ మాఫీ పక్కా అని చెప్పటం వలన రైతులు ఎప్పటి నుంచో వారు తీసుకున్న వ్యవసాయ ఋణాలను చెల్లించటం మానేసారు.  

ఈ ఋణ మాఫీ మీద సంతకం చెయ్యటానికి తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఉత్సుకత చూపిస్తున్నారు.  కానీ దీని మీద ఇంకా మార్గదర్శకాలు రూపొందించటం మిగిలివుంది.  డ్వాక్రా ఋణాల మాఫీకి ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా అధికారులు ఆ గణాంకాలను కూడా కెసిఆర్ కి సమర్పించారు.  ఆ ఋణాల మొత్తం 8570 వేల కోట్లయితే, లక్ష లోపులో ఉన్న ఋణాలు అందులో 4100 వేల కోట్లకు తేలాయి.  ఈ ఋణాలలో మాఫీలకు పాటించవలసిన విధివిధానాలను ఇంకా నిర్ణయించవలసివుంది.  

కెసిఆర్ పదవీ స్వీకారం చేసి ఈరోజు మూడవ రోజే అయినా ఆయన తన హామీలను నిలబెట్టుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నారు.  అందులో భాగంగా ఈరోజు ఆయన సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం కానున్నారు.  

ఈ విషయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఋణ మాఫీ ప్రణాళికను సిద్ధం చెయ్యకపోవటంతో వస్తున్న ఇబ్బందుల్లో ఒకటి బ్యాంక్ లు రైతులను ఋణాలను తిరిగి చెల్లించమని వత్తిడి చెయ్యటం జరుగుతోంది.  పైగా ఋణ మాఫీ మార్గదర్శకాలు తయారవకపోవటంతో కొత్తగా ఋణాలు ఇవ్వటానికి సంశయిస్తున్నారు.  అదీగాక ఋణాలు వసూలు కాకపోతే కొత్త ఋణాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.  ఈ విషయాలను జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునివెళ్ళారు.  సచివాలయంలో ఆయనను కలవటమే కాకుండా లిఖిత పూర్వకంగా జీవన్ రెడ్డి ఈ సమస్యను త్వరగా పరిష్కరించమని ముఖ్యమంత్రిని కోరారు.  

ఈరోజు బ్యాంకర్లతో జరుగనున్న సమావేశంలో కెసిఆర్ తో పాటు ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా హాజరవుతారు.  ఇందులో ఋణమాఫీకి సంబంధించిన అనేక ఆర్థిక అంశాలను చర్చించనున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles