Loksabha sessions start from june 4

Loksabha sessions start from june 4, New Loksabha Speaker Sumitra Mahajan, Protem speaker Kamalanath, Parliament condoles Gopinath Munde's death

Loksabha sessions start from june 4

నేటినుండి కొలువుతీరనున్న కేంద్ర ప్రభుత్వం

Posted: 06/04/2014 09:27 AM IST
Loksabha sessions start from june 4

ఈ రోజు నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  

ఇతర దేశాలలో ప్రభుత్వాలు పడిపోవటాలు, కొత్త ప్రభుత్వాలు రావటాలు చూస్తుంటే మన దేశం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎంత గౌరవం ఇస్తోందో అర్థమౌతోంది.   ఈ కింది కార్యక్రమాలను చూస్తే, ఇది ఒక వ్యవస్థని, ఒక వ్యక్తితో కాని, ఒక పార్టీ సిద్ధాంతాలతో కాని నడిచేది కాదని విశిదమౌతోంది.  

ఈరోజు లోక్ సభ మొదలవుతుంది నిజమే కానీ స్పీకర్ కావాలి కదా.  లోక్ సభ మొదలైన తర్వాతనే స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.  దానికి జూన్ 6 వ తేదీని నిర్ణయించారు.  అందువలన ఈ లోపులో గత యుపిఏ ప్రభుత్వంలో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసిన కమలనాధ్ ని తాత్కాలికంగా స్పీకర్ గా నియమించటం జరిగింది.  అయితే ఆయన ఆ బాధ్యతలు చేపట్టే ముందుగా రాష్ట్రపతి ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించటం జరుగుతుంది.

లోక్ సభ సమావేశమౌతూనే సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ 16 లోక్ సభ ఏర్పాటును ప్రకటిస్తారు.  పార్లమెంటరీ వ్యవహారాలను చూస్తున్న వెంకయ్యనాయుడు లోక్ సభ కార్యక్రమాలను వివరిస్తూ, ఈ రోజు లోక్ సభలో నిన్న అకాల మృత్యువాత పడిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి గోపీనాథ్ ముండేకి సంతాపం తెలియజేసిన తర్వాత సభ ముగుస్తుందని అన్నారు.  నిజానికి ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈరోజు, రేపు కొత్తగా లోక్ సభలోకి అడుగుపెడుతున్న ఎంపీల ప్రమాణస్వీకారం జరగాలి.  కాని అది ఇప్పుడు 5, 6 తేదీల్లో జరుగనుంది.

సుమిత్రా మహాజన్ పేరును స్పీకర్ గా ఖరారు చెయ్యటం జరిగింది.   ఆయన బాధ్యతలను స్వీకరించటంతో కమలనాధ్ తాత్కాలిక స్పీకర్ బాధ్యతలు తీరిపోతాయి.

ఈనెల 9 న రాజ్యసభ సమావేశాలు ప్రారంభమౌతాయి.  ఆరోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ఉపన్యసిస్తారు.  అందులో కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచనలు ఇస్తారు.  10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది.  దాని తర్వాత సభ వాయిదాపడుతుంది.  లోక్ సభ, రాజ్య సభ సమావేశాలు ఒక్కసారే ముగియనున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles