Modi meetings with bureaucrats

Modi meetings with bureaucrats, Modi meets central secretaries direct, Modi way of functioning with tabs on Ministers

Modi meetings with bureaucrats, Modi meets central secretaries direct

కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలతో మోదీ ముఖాముఖి

Posted: 06/03/2014 12:04 PM IST
Modi meetings with bureaucrats

మొదటిసారిగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే సెక్రటరీలతో ముఖా ముఖీగా మాట్లాడటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుడుతున్నారు.  ఈరోజు సాయంత్రం మోదీ సెక్రటరీలందరితోనూ వాళ్ళ వాళ్ళ మంత్రల సమక్షంలో కాకుండా నేరుగా మాట్లాడబోతున్నారు.  తను చెప్పదలచుకున్నదానిలో డొంక తిరుగుడు లేకుండా నేరుగా చెప్పే అలవాటున్న మోదీ తన ప్రభుత్వంలో ఎలాంటి నిబద్ధత ఉండాలని తాను కోరుకుంటున్నది, అందుకోసం తనెలా పనిచెయ్యదలచుకున్నది, అధికారుల నుండి తాను ఏమి ఆశిస్తున్నది స్పష్టం చెయ్యదలచుకున్నారు.

 లోగడ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్రాలలోని సెక్రటరీలతో సమావేశమయ్యరు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం సెక్రటరీలతో ప్రధానమంత్రి నేరుగా సమావేశమవటం ఇదే మొదటిసారు.  

రాజకీయంగా మార్గదర్శనం, అధికారుల అనుభవాన్ని మేళవించే ప్రక్రియే ఇది అంటూ ఈ విషయంలో ఒక అధికారి స్పందించారు.  

కొందరు ముఖ్యమంత్రలకు కూడా నేరుగా సెక్రటరీలతో చర్చించే అలవాటుంది.  క్యాబినెట్ నోట్ తయారు చెయ్యటం, దాన్ని మంత్రివర్గబృందానికి పంపించటం జరుగుతుంది.  అందులో బ్యూరోకేట్స్ ప్రమేయం ఉండదు.  అలా కాకుండా నేరుగా బ్యూరోకేట్స్ తోనే చర్చించినప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటుంది.  దానితో వారి మీద బాధ్యత కూడా పెరుగుతుంది.  ఇది చాలా మంచి పద్ధతి అంటూ ఒక  బ్యూరోకేట్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  

మరో ప్రయోజనమేమిటంటే ఇలా నేరుగా బ్యూరోకేట్స్ తో టచ్ లో ఉండటం వలన ప్రధాన మంత్రి తన మంత్రుల మీద కూడా నియంత్రణ పెరుగుతుంది.  అయితే వాళ్ళందరినీ ఒకేసారి కాకుండా బ్యూరోకేట్స్ ని 16 బృందాలుగా చేసి వాళ్ళతో బుధవారం నుంచి వరుసగా సమావేశమవబోతున్నారు.

మోదీ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ ఏర్పాటు జరిగినట్లుగా తెలుస్తోంది.  ఎందుకంటే ఆయన సూచన మేరకు కేబినెట్ సెక్రటరీ ఇలాంటి సమావేశాలను నిర్వహించారు.  

మొత్తానికి ప్రభుత్వాన్ని నడపటంలో మోదీ ఎక్కడా ఎలాంటి లొసుగులనూ వదల దలచుకోలేదని తెలుస్తోంది.  ఆయన తాను కన్న కలలను సాకారం చేసుకోవటానికి ఎన్ని విధాలుగా కృషిచేస్తున్నారన్నది దీనితో అర్థమౌతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles