Jr ntr pays respects to grandfather senior ntr

Jr NTR pays respects to grandfather, junior ntr wants senior ntr reborn, senior ntr, NTR Ghat, Harikrishna, Kalyan Ram, Telugu cinema legend NTR, NTR Ghat today, Telugu Desam Party.

Jr NTR pays respects to grandfather Senior NTR, junior ntr wants senior ntr reborn

తాతను పెద్ద కోరిక కోరిన జూ.ఎన్టీఆర్

Posted: 05/28/2014 09:40 AM IST
Jr ntr pays respects to grandfather senior ntr

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 91వ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసుండటమే మహానటుడు ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని టీడీపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ తెలిపారు.

ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని హరికృష్ణ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జయంతిని ప్రజలు పండుగగా జరుపుకోవాలన్నారు.హరికృష్ణతోపాటు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్నలతోపాటు ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి కూడా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.

Ntr-jr-Ntr

అయితే తాతను జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కోరిక కోరాడు. తాత (ఎన్టీఆర్ ) నువ్వు మళ్లీ.. మళ్లీ జన్మించాలని అడిగినట్లు తెలుస్తోంది. ( అంటే జూనియర్ ఎన్టీఆర్ భార్య ఇప్పుడు ప్రేగ్నెంట్ గా ఉన్న విషయం తెలిసిందే). ఇప్పుడు నందమూరి ఇంటా పెద్ద ఎన్టీఆర్ పుట్టాలనేది అందరి కోరిక. అందుకే జూ. ఎన్టీఆర్ ఆ కోరిక కోరినట్లు తెలుస్తోంది.

మహానటుడు ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని దర్శకుడు వైవీఎస్ చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరీ, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులతోపాటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీలు ఎన్టీఆర్ కు నివాళులర్పించినవారిలో ఉన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles