First time 4000 thousand members in rashtrapati bhavan

Rashtrapati Bhawan for Narendra Mod swearing, Rashtrapati Bhawan, first time 4000 thousand members, Rashtrapati Bhavan ready for Modi swearing, 4,000 mark, President of India Shri Pranab Mukherjee, Pranab Mukherjee, Pranab Mukherjee and modi.

first time 4000 thousand members in rashtrapati bhavan, Rashtrapati Bhavan ready for Modis swearing

ఇండియాలో ఇదే తొలిసారి...

Posted: 05/26/2014 11:04 AM IST
First time 4000 thousand members in rashtrapati bhavan

మనదేశంలో ఇదే తొలిసారి ఇలా జరగటం. ఇప్పటి వరకు 13 మంది ప్రదాని మంత్రులుగా పదవి చేపట్టారు. అయితే వారి ప్రమాణ స్వీకారం మాత్రం ఇలా జరగలేదని రాష్ట్రపతి భవన్ లోని ఉన్నత ఉద్యోగులు అంటున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలకు 1500నుంచి 2వేలమంది అతిథులు హాజరయ్యారని, తొలిసారిగా 4వేలమంది అతిథులు హాజరవుతున్నారని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మీడియా కార్యదర్శి ఒమితా పాల్ తెలిపారు.
ప్రమాణ కార్యక్రమానికి తొలుత మూడు వేల మంది అతిథులు హాజరవుతారని భావించినా ఆ సంఖ్య నాలుగు వేలకు చేరింది.

రాష్ట్రపతి భవన్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోరుకుంటారని.. ఈ వేడుకకు భారీగా అతిథులు హాజరవుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారని ఒమితా పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో మెరుపులతో కూడిన వర్షం కురవవచ్చన్న వాతావరణ శాఖ నివేదికపై ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమం సజావుగా సాగుతుందని, వర్షం ఆటంకపర్చదని ఆశిస్తున్నాం.

ఒకవేళ ఆ పరిస్థితి వస్తే.. వేదికను దర్బార్‌హాల్‌కు మార్చుతాం. అందులో 500మంది కూర్చోవడానికి మరో 400మంది నిల్చుని కార్యక్రమం చూడటానికి అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. అతిథులంతా సాయంత్రం 5 గంటలకే వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు.

నడిచేందుకు ఇబ్బంది పడే అతిథులను ఫోర్‌కోర్ట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా 12 గుర్రపు బగ్గీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 777 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానాలు పంపామని.. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్యవేత్తలు, రాజ్యాంగసంస్థల అధిపతులు, యూపీఏ-2 ప్రభుత్వంలో మంత్రులు, 350మందికిపైగా పాత్రికేయులు కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పా రు.

అతిథులను ఆహ్లాదపర్చేందుకు సైనిక, నౌకా, వాయు బ్యాండ్లు దళాలు దేశభక్తి గీతాలు ఆలపించనున్నాయని.. 4.45నిమిషాలనుంచే వీవీఐపీల రాక, కార్యక్రమంపై వ్యాఖ్యానం ప్రారంభమవుతుందని తెలిపారు. వేదిక వద్ద తక్షణ వైద్య సహాయం కోసం అంబులెన్స్‌లు, వైద్యులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మన దేశంలో ఇలా జరగటం ఇదే తొలిసారి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles