2 ysrcp mps join tdp

2 YSRCP MPs join TDP, YSRCP failure in 2014 elections, Nandyala and Kurnool MPs join TDP

2 YSRCP MPs join TDP

వైకాపాలో మూలిగే నక్కమీద తాటిపండు సామెతన..

Posted: 05/26/2014 12:07 PM IST
2 ysrcp mps join tdp

సార్వత్రిక ఎన్నికలలో అసలే ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో ఏం చెయ్యాలో పాలుపోకుండా ఉన్న వైయస్ ఆర్ కాంగ్రెస్ కి దెబ్బ మీద దెబ్బ లా ఇద్దరు ఎంపీలు పార్టీ వీడి ఆదివారం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడితో కలవటం జరిగింది.  వారు నంద్యాల ఎంపీ వైఎస్వీరెడ్డి, కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక.

ప్రమాణ స్వీకారం జరగక ముందే తెదేపా ఇంకా బలోపేతమౌతోంది.  ఎంపీలిద్దరూ తెదేపాకి మద్దతు తెలపటమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని అన్నారు.  వీరిద్దరిలో వైఎస్వీరెడ్డి తెదేపాలో కలవగా రేణుక భర్త నీలకంఠం కూడా తెదేపా ఖండువా కప్పుకున్నారు ఎందుకంటే రేణుక తెదేపా లో సభ్యురాలిగా చేరకుండా అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని అన్నారు.  

తెలుగు దేశం పార్టీ ఆ నాయకులను పార్టీలోకి ఆహ్వానించే ముందు స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.  

వైఎస్వీ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుండటం వలన తన ప్రాంత అభివృద్ధి దృష్ట్యా తెదేపాలో చేరానని అన్నారు.  జగన్ తో కానీ వైకాపాలో కాని తనకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, తనకి ప్రజలే ముఖ్యం కాబట్టి వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.  తాను పార్టీ మారటం వలన ఎంపీ పదవి రద్దయిన పక్షంలో తిరిగి పోటీ చేస్తానని తాను గెలవటం మాత్రం ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తంచేసారు.  

రేణుక కూడా అదే పంథాలో మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ప్రజలకు కొన్ని హామీలను చేసామని, వాటిని నెరవేర్చే బాధ్యత తన మీద ఉందని, అలా చెయ్యలేనట్లయితే రాజకీయాలలో పనిచెయ్యటానికి అర్థమనేదే ఉండదని అన్నారు.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీయే అయినా, ఎన్నికల కమిషన్ చేత గుర్తింపు పొందిన పార్టీ కాదు కాబట్టి పార్టీ సభ్యల మీద అనర్హతను ప్రకటించే హక్కు ఆ పార్టీకి లేదు.  దీని ఆధారంగా మరి కొందరు సభ్యులు కూడా తెదేపా లోకి మారతారేమోనన్న భయం ఆ పార్టీని పట్టుకుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles