Kcr camp office in kundanbagh

KCR Camp office in Kundanbagh, Telangana Chief Minister designate KCR Camp office, Present camp office not acceptable to KCR, present camp office against vastu norms

KCR Camp office in Kundanbagh

కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ కుందన్ బాగ్ లో

Posted: 05/22/2014 05:18 PM IST
Kcr camp office in kundanbagh

ప్రస్తుతం ఉన్న సిఎం క్యాంప్ ఆఫీస్ వాస్తు బాగోలేదని తెలంగాణా పగ్గాలు చేపట్టబోతున్న కెసిఆర్ కుందన్ బాగ్ లో తన క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకోబోతున్నారు.  పాత ముఖ్యమంత్రులు ముగ్గురు ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి పనిచేసి పనికిరాకుండా పోయారని, అందువలన కెసిఆర్ కుందన్ బాగ్ కి ప్రాధాన్యతనిస్తున్నారని, అయితే అక్కడ కూడా వాస్తు ప్రమాణాలతో మార్పులు చెయ్యవలసివుంటుందని తెరాస పార్టీ వర్గాలు అంటున్నాయి.  

కుందన్ బాగ్ లోని మంత్రుల నివాసంలో 10 బంగ్లాలున్నాయి.  అందులో నాలుగిటిలో హైకోర్టు జడ్జ్ లున్నారు, ఒకదానిలో మాజీ మంత్రివర్యులు, ఐదిటిలో బ్యూరోక్రాట్స్ నివాసముంటున్నారు.  మినిస్టర్ క్వార్టర్స్ కి పక్కనున్న రెండు బిల్డింగ్ లలో ఒక ఐఎఎస్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఉంటున్నారు.  వాళ్ళని వెంటనే ఖాళీ చెయ్యమని జివో కూడా ఇవ్వటం జరిగింది.  వాళ్ళకి కుందన్ బాగ్ లో గవర్నమెంట్ క్వార్టర్స్ కేటాయించారు.  

అయితే 20 సంవత్సరాల పాతవైన ఆ భవనాల మరమ్మతులు, మార్పులకు కెసిఆర్ దగ్గర్నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి కానీ ఎటువంటి సూచనలు రాలేదని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ అధికారులంటున్నారు.  ఆ బంగ్లాలు ఒక్కొక్కటి 6000 చదరపు అడుగులలో నిర్మించబడ్డాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles