Modi s invitation makes pak pm indecisive

Modi's invitation makes Pak PM indecisive, Pakistan PM Nawaj Sharif indecisive, Modi swearing in ceremony on 26th,

Modi's invitation makes Pak PM indecisive

పాక్ ప్రధానిని ఇరుకునపెట్టిన మోదీ ఆహ్వానం!

Posted: 05/22/2014 02:04 PM IST
Modi s invitation makes pak pm indecisive

26 వ తేదీన భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్న నరేంద్ర మోదీ ఆ వేడుకలో పాలుపంచుకోమని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కి ఆహ్వానం పంపించారు.  పొరుగు దేశాలతో సత్సంబంధాలకోసం మైత్రీ హస్తాన్ని చాచిన మోదీ చర్యను అందరూ ప్రశంసించినవారే.  

అయితే, ఆ వేడుకకు హాజరవాలా వద్దా అన్న నిర్ణయానికి నవాజ్ షరీఫ్ రాలేకపోయారు.  బహుశా ఈ రోజు సాయంత్రానికల్లా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని మిలిటరీ, సివిల్ నాయకులు, అధికారులు చెప్తున్నారు.

ఆయన సొంతపార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ నాయకులు, నవాజ్ షరీఫ్ భారత్ తో సంబంధాన్ని పటిష్టం చేసుకోవాలని అనుకుంటున్నారని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని, అయితే మరికొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవలసివుందని అన్నారు.  ఆహ్వానం అందటంలో వ్యవధి ఎక్కువగా లేకుండాపోయిందని, ఆయన ఆలోచించుకోవటానికి ఇంకా సమయం పడుతుందని కూడా అన్నారు.  

ఒకవేళ ఆహ్వానాన్ని మన్నించకుండా భారత్ కి వెళ్ళకుండా ఉంటే భారత్ కి కాని ప్రపంచ దేశాలకు కానీ ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్నది ఆలోచించవలసిన విషయం.  ఒకవేళ వెళ్తే, మోదీ పాకిస్తాన్ కి వ్యతిరేకన్న అభిప్రాయమున్న కొన్ని సంస్థల నుంచి వ్యతిరేకత రావొచ్చు.  ఇదే ఆయన మనసులో మెదులుతున్న, ఆయనను సందిగ్ధంలో పడేస్తున్న విషయాలు.

కాబోయే భారత ప్రధాని నుంచి అనూహ్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రికి వచ్చిన ఆహ్వానం వలన నవాజ్ షరీఫ్ కి నిర్ణయం తీసుకోవటంలో సంక్లిష్టత ఏర్పడిందని ఇరుదేశాల మధ్య డిప్లోమేటిక్ వర్గాల నుంచి అందిన సమాచారం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles