Naxal problem in telangana separate state

KCR to curb Maoists activities in Telangana, Naxals problem in Telangana state, Merging all police wings in to one, KCR CM Telangana state

Naxal problem in Telangana separate state

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య?

Posted: 05/22/2014 11:19 AM IST
Naxal problem in telangana separate state

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడినవారు చెప్పిన కారణాలలో ఒకటి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమైనట్లైతే నక్సల్స్ సమస్య పునరావృతమౌతుందని.  ఈ విషయం శ్రీకృష్ణ కమిటీ కూడా సూచించింది.  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేక సందర్బాల్లో నక్సల్స్ ని ఏవిధంగా నియంత్రిస్తూ వచ్చింది తెలియజేస్తూ, అదంతా వృధా అయిపోతుందని, రాష్ట్ర విభజన జరగగానే మావోయిస్ట్ ల దాడులు తిరిగి పెరిగిపోతాయని ఆవేదనను వ్యక్తం చేసారు.

అదంతా ఏమీ లేదని, మావోయిస్ట్ ల ప్రభావం విశాఖ పట్నంలోనే ఎక్కువగా ఉందని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ చెప్తూ వచ్చినా, ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారెయ్యకుండా ఆయన పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు.  మావోయిస్ట్ చర్యలను నియంత్రించటంలో భాగంగా పోలీస్ శాఖను ఏకత్రాటి మీదకు తెస్తే ఎలావుంటుందన్న విషయంలో ఆయన చర్చలు సాగిస్తున్నారు.  

సరిహద్దు ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ మావోయిస్ట్ ల కదలికలు ఎప్పటికప్పుడు వెను వెంటనే పోలీస్ శాఖలో ఉన్నాతాధికారులకు అందేట్టుగా ఎలా చెయ్యాలన్న దిశగా కెసిఆర్ సమాచార సేకరణ ప్రారంభించారు.  శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం కాబట్టి కెసిఆర్ దాని మీద దృష్టి సారిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles