Tdp joining nda government

TDP joining NDA Government, TDP supremo Chandrababu Naidu praises Modi, Chandrababu meets NDA members

TDP joining NDA Government

ఎన్డియేలో భాగం వహిస్తున్న తెదేపా

Posted: 05/21/2014 09:41 AM IST
Tdp joining nda government

సోమవారం నుంచి ఢిల్లీలోనే ఉండి భారతీయ జనతా పార్టీ నేతలు, ఎన్డియే కూటమిలోని ఇతర భాగస్వాములు, ప్రధానమంత్రిగా నియమితులైన నరేంద్ర మోదీలతో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.  భాజపాతో పొత్తుతో ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ స్థానాలకు గాను తెదేపా 16 స్థానాలను గెలుచుకుంది.  

ఎన్డియే కూటమిలోని ప్రతి పార్టీని ప్రభుత్వంలోకి ఆహ్వానించిన భాజపా అన్ని పార్టీలకు సముచిత స్థానాన్నిస్తూ ఆ పార్టీలలోని నాయకులకు కూడా మంత్రి పదవులను కట్టబెట్టనుంది.  తెదేపాకి ఎన్ని పదవులు వస్తాయో వేచి చూడవలసివుంది.  అయితే సార్వత్రిక ఎన్నికలలో గెలుచుకున్న పార్లమెంటు సీట్లనిబట్టి ఆ నిష్పత్తిలో ఉంటుంది.  ఈ వారాంతానికల్లా ఆ నిర్ణయం జరిగిపోతుందని భాజపా సీనియర్ నాయకుడు తెలియజేసారు.  

మంగళవారం నాడు భాజపా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా మోదీ ఎన్నికైన తర్వాత జరిగిన ఎన్డియే సభకు హాజరైన చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles