Narendra modi hectic programs

Modi resigns as Gujarat CM, Narendra Modi hectic programs, New CM for Gujarat, Oath taking ceremony of Gujarat CM, Oath taking of PM Narendra Modi

Narendra Modi hectic programs

ఈరోజు ప్రధాని నియమితులు మోదీ కార్యక్రమాలు

Posted: 05/21/2014 08:55 AM IST
Narendra modi hectic programs

ఒకపక్క అభినందనలు అందుకుంటూనే ప్రధానమంత్రిగా నియమితులైన నరేంద్ర మోదీ ఒక్కో పనిని పూర్తి చేసకుంటున్నారు.  

అక్టోబర్ 7, 2001 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ గవర్నర్ కమ్లా బేణీవాల్ కి రాజీనామా సమర్పించనున్నారు.  మంగళవారం రాష్ట్రపతి చేత ప్రధానమంత్రిగా నియమించబడ్డ మోదీ 26న ప్రమాణం స్వీకారం చెయ్యటానికి ఆయన అంగీకారాన్ని తీసుకున్నారు.  ఈ లోపులో మోదీ చెయ్యవలసిన పనులు కొన్ని ఉన్నాయి.  అందులో మొదటిది ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి చెయ్యనున్న రాజీనామా.  రెండవది గుజరాత్ లో మరో ముఖ్యమంత్రిని నియమించటం.  మూడవది లోక్ సభకు వడోదర, వారణాసిలలో గెలుపొందిన మోదీ వాటిలో ఒక స్థానాన్ని వదులుకోవటం.  

ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మోదీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు.  ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి హర్షద్ పటేలే వెల్లడించారు.  శాసన సభాపక్ష సమావేశంలో మోదీ స్థానంలో ఎవరిని ఎంపిక చెయ్యాలన్నది నిర్ణయించబడుతుంది.  ఈ ప్రక్రియంతా సజావుగా సాగటం కోసం భాజపా సీనియర్ నేత తవర్ చంద్ గెహ్లాట్ ని పరిశీలకునిగా పంపించటం జరుగుతోంది.  ఆ తర్వాత స్పీకర్ వాజూభాయ్ వాలాతో సమావేశమైన తర్వాత మోదీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి సమర్పిస్తారు.  

రేపు గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles