Trs president kcr speaks after win in telangana

TRS President KCR speaks after win in Telangana, TRS wins in Telangana, KCR to stick to Election manifesto, KCR reiterates his promises,

TRS President KCR speaks after win in Telangana

తెలంగాణా నాయకుడు చంద్రశేఖరుని హామీ

Posted: 05/17/2014 09:37 AM IST
Trs president kcr speaks after win in telangana

తెలంగాణా రాష్ట్ర సమితి తెలంగాణాలో ప్రభంజనం సృష్టించింది.  119 శాసనసభ స్థానాలకు గాను ఆ పార్టీ 63 స్థానాలను కైవసం చేసుకుని నవ్య తెలంగాణాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.  అలాగే 17 పార్లమెంట్ స్థానాలలో 11 స్థానాలను తెరాస గెలుచుకుంది.  తెలంగాణా ప్రజలు మున్సిపల్, పరిషత్ ఎన్నికలలో ఎన్నుకున్న పార్టీలకు, రాష్ట్రాన్ని నడిపించి కేంద్రంలో ప్రాతినిధ్యం వహించవలసిన పార్టీలకు స్పష్టమైన తేడా చూపించారు.  అందుకు పట్టుదలతో ఎన్నికలలో ప్రచారం చేసిన తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కృషే కారణం.  

తెలంగాణా ఆవిర్భావం ఇంకా పూర్తి కాలేదని, విభజన విషయంలో చెయ్యవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయని, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎంతో పని ఉందని, అసలు పని అదేనని, అభివృద్ధి చెయ్యాలంటే తెరాస పార్టీయే చెయ్యాలని, కాంగ్రెస్, తెదేపాల వ్యవహార శైలిని గతంలో చూసాం కాబట్టి నమ్మలేమని తెలంగాణా ప్రజల మనసులోకి బలంగా నాటుకుపోయేట్టుగా చెయ్యటం వలనే ఆ పార్టీకి పట్టం కట్టారు అక్కడి వోటర్లు.  

తెరాస ఘనవిజయం తర్వాత కెసిఆర్ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ప్రకటించిన హామీలను తు చ తప్పకుండా అమలుపరుస్తామని ఆయన మాటిచ్చారు.  అంతకు ముందు తెలంగాణా రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేసి విజయం సాధించిన తెరాస ఇప్పుడు తెలంగణా పునర్నిర్మాణమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తుందని, అందుకు ఇతర పార్టీల సహకారాన్ని కూడా తీసుకుంటుందని తెలియజేసారు.  పార్టీని గెలిపించిన వోటర్లకు, పార్టీలో పనిచేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్ ఈ రోజు శాసన సభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశాలుంటాయని ప్రకటించారు.

ముఖ్యంగా ఈ విజయాన్ని గర్వకారణంగా తీసుకోవద్దని, అనవసరమైన భేషజాలకు పోవద్దని, ఎన్నికలలో తమను గెలిపించి ప్రజలు తమ మీద పెద్ద బాధ్యతను పెట్టారు కాబట్టి ఆ పని మీద ఉండాలని, ప్రజలు తమ మీద పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.  

భారతీయ జనతా పార్టీ తరఫున అఖండ విజయం సాధించిన ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలియజేసిన కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తామని, తెలంగాణా అభివృద్ధికోసం ప్రధానమంత్రి మోదీ సహకారాలను కోరుతానని అన్నారు,

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles