Pawan kalyan behind tdp success

Pawan Kalyan behind TDP success, TDP wins over YSRCP, TDP wins in Seemandhra, TDP win due to Pawan Kalyan

Pawan Kalyan behind TDP success

వీస్తున్న తెదేపా పవనాల వెనక పవన్!

Posted: 05/17/2014 09:03 AM IST
Pawan kalyan behind tdp success

సీమాంధ్రలో నువ్వా నేనే అన్నట్లుగా పోటీలో నిలబడ్డ తెలుగు దేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల మధ్య అంతరాన్ని పెంచిన ఘనత పవన్ కళ్యాణ్ కి ఇవ్వటంలో గెలుస్తున్న తెదేపాకి కానీ ఓడిపోతున్న ఇతర పార్టీలకు కానీ ఎటువంటి అభ్యంతరాలు ఉండగూడదు మరి.

వైకాపాకి కచ్చితంగా గెలుపు లభిస్తుందనుకున్న చోట్ల కూడా తెదేపా భాజపాకు రావటం జరిగింది.  ఉదాహరణకు విశాఖపట్నం లో విజయమ్మ ఓటమి. అక్కడ కచ్చితంగా వైకాపా వస్తుందనే అభిప్రాయపడబట్టే అక్కడ విజయమ్మను నిలబెట్టారు.  అంతేకాదు విశాఖ పట్నం సీటు భాజపాకి ఇస్తున్నారని తెలిసి అక్కడ విజయమ్మను ధైర్యంగా నిలబెట్టటం చేసారు. 

ఇంకా ఈ క్రింది నాయకులను చూస్తే వాళ్ళు కచ్చితంగా గెలుస్తారని వైకాపాయే కాదు అందరూ నమ్ముతూ వస్తున్నదే కానీ వాళ్ళు ఓడిపోవటానికి కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా కలిగిన పరిణామమంటూ ఉంటే అది ఒకటే- పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేయటం.  వైకాపాలో ముఖ్యులైన అంబటి రాంబాబు, బాలినేని శ్రీనివాసరావు, ధర్మాన ప్రసాదరావు ఓటమి ఎందుకు జరిగిందో పరిశీలిస్తే అందుకు కారణం కేవలం అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే కారని, పవన్ వలన రాష్ట్రంలో వీచిన తెదేపా భాజపా పవనాలని అర్థమౌతుంది.  

మీడియాలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఎన్నికల ఫలితాలు తనకి ఆనందాన్ని కలిగించాయని, తనకి ఎవరితోనూ శత్రుత్వం లేదని, కేవలం గత పదేళ్లుగా జరుగుతున్న దోపిడీ విధానం తనని కలతపెట్టిందని, అలా దోపిడీ చేసి అవినీతికి పాల్పడితే గెలవవచ్చని ఆశించినవారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని అన్నారు.  

తెలంగాణాలో గెలిచిన తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కి అభినందనలు తెలియజేసిన పవన్ కళ్యాణ్, ద్వంద్వ విధానాన్ని అవలంబించిన కాంగ్రెస్ కి ఓటమి లభించిందని, మోదీ చంద్రబాబు నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles