Tihar jail inmate 66 get job offers

Tihar Jail Inmate, Raju Parasnath, Delhi, inmates, jail, jobs, prison, recuitment drive, Tihar, Tihar Jail, Tajmahal Group of Companies, Vedanta Foundation, People’s Own Foundation, Ignou

As many as 66 Tihar inmates, who are on the verge of completing their sentences, were today hired by private companies during a recruitment drive at the jail premises.

తీహార్ ఖైదీలకు భారీ వేతంతో కూడిన ఉద్యోగాలు

Posted: 05/08/2014 01:22 PM IST
Tihar jail inmate 66 get job offers

పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చే యాజమానులు అవినీతికి పాల్పడి తీహార్ జైల్లో చిప్పకూడు తింటుంటే... తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకు తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు మాత్రం పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అవును తీహార్ జైల్లో ఖైదీలకు బడా సంస్థలు ఇంటర్య్వూలు నిర్వహించి మంచి పారితోషికంతో ఉద్యోగాలు ఇచ్చారు.

గత రెండు రోజుల క్రితం తీహార్ జైల్లోని ఖైదీలకు నిర్వహించిన ఉద్యోగ మేళాలో రాజు ప్రశాంత్ అనే ఖైదీకి తాజ్ మహల్ గ్రూఫ్ ఆఫ్ హోటల్స్ కంపెనీలో అసిస్టెంట్ బిజినెస్ డెవలప్ మేనేజరుగా ఎంపికయ్యాడు. నెలకు 35 వేల వేతనంతో కూడిన ప్యాకేజీ ఇచ్చి ప్రశాంత్ ని తీసుకున్నారు. ఇగ్నో నుండి డిగ్రీ అందుకున్న ఈయన గత ఎనమిది సంవత్సరాలుగా ఈ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.

ప్రశాంత్ సత్ర్పవర్తన కారణంగా త్వరలోనే విడుదల కానున్నాడు. ఇక్కడ నిర్వహించిన జాబ్ మేళాలో ఇంకా అరవైఆరు మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీరిని చూసైనా అదే జైల్లో బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు మారుతారో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles