Pawan kalyan padayatra

Pawan Kalyan padayatra, Jana sena party, Eelction promises, Jana Sena Presidnent Pawan Kalyan, jana Sena party to question, Jana Sena to ensure election promises

Janasena party President Pawan Kalyan padayatra

లోక కళ్యాణం కోసం కాలినడకన బయల్దేరుతున్న పవన్ కళ్యాణ్

Posted: 05/08/2014 10:50 AM IST
Pawan kalyan padayatra

గాలిలో ప్రయాణం చేస్తే దారిలో ఎవరూ కనిపించరు.  రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తే కొందరు కలుస్తారు.  సైకిల్ మీద వెళ్తే ఇంకా ఎక్కువ మందిని చూడవచ్చు.  పాదయాత్రైతే దారిలో అందరినీ కలవవచ్చు.  

గమ్యం ఒకే స్థానమైతే ఏ వాహనం మీదైనా పోయి చేరుకోవచ్చు.  కానీ ప్రతి మనిషి అభ్యుదయం లక్ష్యమైనప్పుడు భూభాగమంతా గమ్యమే అవుతుంది కాబట్టి కాలినడకే సరైన విధానం.  

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావటం రోజురోజుకీ ఇంతవరకు ఎవరూ చూడని, వినని, వినూత్న విధానంలో ముందుకెళ్ళటం రాజకీయ విశ్లేషకులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  తన అంబుల పొదిలోని ఒక్కో అస్త్రాన్నీ సమయానుకూలంగా ఉపయోగిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తన దగ్గరున్న అస్త్రాలన్నిటినీ ఒక్కసారిగా ప్రదర్శించదలచుకోలేదనిపిస్తోంది.  

ప్రశ్నించటానికే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తనకి పదవులు, అధికారాల మీద మక్కువ లేదని చెప్తూ, నిజాయితీగా పనిచేసే వాళ్ళకి తన మద్దతునిస్తానని చెప్పినట్లుగానే భారతీయ జనతా పార్టీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చారు.  తెలంగాణాలో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ని, సీమాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని విమర్శించినా, మద్దతునిస్తున్న పార్టీలు నావి కాబట్టి ఇతర పార్టీలను మాత్రమే విమర్శించి వూరుకుంటాననటం లేదు.  తాను మద్దతునిచ్చిన పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకునేట్లుగా చూస్తానంటున్నారు పవన్ కళ్యాణ్.  

పదవులను ఆశించేవారు ఎన్నికల ముందు పాదయాత్రలను చేస్తారు.  కానీ అధికారం వచ్చిన తర్వాత నిజంగా బాధ్యతలను చేపట్టేవారే ఎన్నికల తర్వాత కూడా జనంలోకి వెళ్తారు.  ఇక అధికారం మీద మమకారమే లేదంటున్న పవన్ కళ్యాణ్ తన మాటలను నిలబెట్టుకుంటూ ఎన్నికల తర్వాత పార్టీలిచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రశ్నించటానికి పాదయాత్ర చెయ్యటమనేది చాలా గొప్ప విషయం.  

ఈ లెక్కన చూస్తుంటే పవన్ కళ్యాణ్ నిజంగా తను అనుకున్నట్లుగానే రాజకీయాలను ప్రక్షాళన చెయ్యటానికే నడుం కట్టినట్లయితే 2019 నాటికి ఆయన రాజకీయ నాయకుడి ముద్ర సినిమా కథానాయకుడి ముద్రను చెరిపివేసి ఆ స్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  అయితే ఒక రంగంలో అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు మరో రంగంలోకి పోతారు కానీ, సినిమా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ వెనువెంటనే రాజకీయ రంగంలోకి దూకటం కూడా సాహసమే.  అది ఆయన పట్టుదల, కార్యదీక్షలను సూచిస్తోంది.  పాత రాజకీయ శైలికి అలవాటుపడ్డవాళ్ళకి అది తిక్క లాగానే కనిపించవచ్చు.  రాజకీయాలంటే వ్యాపారంలా చూసేవారికి, పవన్ కళ్యాణ్ తిక్కకి లెక్కే లేదని కూడా అనిపించవచ్చు.  

కానీ రాజకీయాలకు ఆచరణలో నిర్వచనాన్ని మార్చివేస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ రంగంలో కూడా అభిమానులను కూడగట్టుకోవటం ఖాయమనిపిస్తోంది,  అయితే ఇదే పట్టుతో, ఇదే వేగంతో, భావి ప్రణాళిక గురించి ఇంతే గోప్యతతో, ఎప్పిటికప్పుడు తన లక్ష్యం దిశగా పయనించటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అంత వరకే ప్రకటిస్తూ పోవటం కూడా అవసరమే.  లేకపోతే పవన్ కళ్యాణ్ ముందుగానే భయాన్ని ప్రకటించినట్లుగా రాజకీయాలను వ్యాపారంగా మార్చుకున్న వాళ్ళు, అందుకోసం ప్రజల హక్కలను కర్కశంగా కాలరాసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ని ముందుకు సాగనివ్వరు.  

ప్రణాళిక ప్రకారం సమాజానికి నష్టం చేస్తారనుకున్నవాళ్ళను ఎండగడుతూ, పనిచేస్తారనుకున్న వాళ్ళకు మద్దతునిస్తూ చెప్పేదేదో సూటిగా స్పష్టంగా చెప్తూ, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు అస్మదీయులనుకున్నవారిని కూడా వదిలిపెట్టేట్టుగా లేరు.  వాళ్ళిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోయినా వాళ్ళనీ ఎండగడతారనటంలో అనుమానం లేదు.  అందుకే, నేనొక వాచ్ డాగ్ లా ఉంటాను అని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు.  

పవన్ కళ్యాణ్, కీపిటప్ అని రాజకీయ విశ్లేషకులు, సంస్కర్తలు చాలామంది మనసులోనే అనుకుంటున్నారేమో అనిపిస్తోంది. 

సరే మరి సినిమా అభిమానుల సంగతేమిటి అని అనుకుంటున్నారా?  దాన్ని కూడా వదిలిపెట్టనంటున్నారాయన!  గబ్బర్ సింగ్ 2 కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటే, హిందీ ఓ మై గాడ్ రిమేక్ లో కూడా చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles