Clashes between paties even after polling

Clashes between paties even after polling, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

Clashes between paties even after polling

సీమాంధ్రలో ఇంకా ఢీ అంటే ఢా!

Posted: 05/08/2014 11:55 AM IST
Clashes between paties even after polling

కడప జిల్లాలో ఎన్నికల సందర్భంగా పార్టీల మధ్య రాజుకున్న మంటలు ఎన్నికలు అయిపోయినా కార్యకర్తలను ఇంకా చల్లారనివ్వటంలేదు.  కాజీపేటలో తెదేపా వైకాపాల మధ్య రాళ్ళ దాడి జరిగింది.  జరిగిపోయిన ఎన్నికల విషయంలో వాగ్వివాదానికి దిగి చిన్న గొడవగా మొదలైనదాన్ని రాళ్ళ యుద్ధం వరకూ తీసుకెళ్ళారు.  పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలనూ చెదరగొట్టారు.

నెల్లూరు జిల్లాలో దత్తులూరు మండలం ఏరుకోలులో వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్తల మీద దాడి చేస్తుండగా చెదరగొట్టటానికి వచ్చిన పోలీసుల మీద కూడా వైకాపా కార్యకర్తలు తిరగబడ్డారు.  

ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం సూరావారి పల్లెలో తెదేపా నేతల ఇళ్ళపైకే వచ్చిన వైకాపా కార్యకర్తలు ఎనిమిది మందిని గాయపరచారు.  అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

సీమాంధ్రలో ఏ పార్టీ గెలిచినా మరో పార్టీ రాజకీయాల్లో లేకుండా పోతుందేమో అన్నంత భయంతో ఎన్నికలలో హోరాహోరీ పోరాటం సాగింది.  అది ప్రచారం వరకైతే బాగానే వుండేది.  భౌతిక దాడులు, భయభ్రాంతులను చెయ్యటం, అపహరణలు, అధికారులు, పోలీసుల మీద కూడా చెయిజేసుకోవటం దురదృష్టకరమైన ఘటనలుగా పలువురు పేర్కొంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles