Mim party key role in telangana government

MIM party key role in telangana, telangana government formation,asaduddin owaisi, ys jagan, k chandrasekhar rao, lok sabha election 2014, andhra pradesh assembly election 2014.

MIM party key role in telangana government, hung results in telangana, aimim party plays key role in telangana government

తెలంగాణలో కింగ్ మేకర్ మజ్లిస్ కానుందా ?

Posted: 05/07/2014 09:07 AM IST
Mim party key role in telangana government

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ప్రభుత్వం ఏ పార్టీ దక్కించుకుంటుంది. తొలి ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయం మరో పది రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాల కోసం అన్ని పార్టీల వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మాదే... అంటే మాదే అని కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించుకున్నాయి. ఆ పార్టీలు అలా ప్రకటించినా తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, ఇక్కడ హంగ్ ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒక వేళ అదే నిజమైతే తెలంగాణలో కింగ్ మేకర్ గా ఎంఐఎం పార్టీ చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే 60 సీట్లు గెల్చుకోవాలి. ఇన్ని సీట్లు ఏ పార్టీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. 119 స్థానాలలో . తెలంగాణలో టీడీపీ, బీజేపీ కూటమికి 15 నుంచి 20 వరకు సీట్లు, ఎంఐఎంకు 7-8 స్థానాలు, ఇవి కాకుండా సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాలు, స్వతంత్రులు మరో ఐదారు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, ఇతర పార్టీలకు దాదాపు 30 సీట్లు వస్తాయని అంచనా వేసుకున్నా.. మిగిలిన 90 సీట్లను కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పంచుకోవాల్సి ఉంటుంది.

అలాంటప్పుడు ‘హంగ్ ’ ఏర్పడక తప్పదు కాబట్టి ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న చిన్న పార్టీలపై ఆధారపడక తప్పక పోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడా నాయకులు ఇప్పటి నుండే ఎంఐఎం పార్టీతో బేరసారాలు సాగిస్తున్నారని అంటున్నారు. దీని పై మజ్లీస్ ఇప్పటికిప్పుడు ఎలాంటి హామీ ఇవ్వకుండా, ఫలితాల తరువాత ఆచితూచి స్పందచించాలని చూస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles