Sabbam hari withdraws from contesting in elections

Sabbam Hari withdraws elections, Elections 2014, Jai Samaikyandhra party, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Sabbam Hari withdraws from contesting in elections

విశాఖ బరిని వీడిన సబ్బం హరి

Posted: 05/06/2014 05:08 PM IST
Sabbam hari withdraws from contesting in elections

రాష్ట్ర ఎన్నికలలో విశాఖబరిలో ఉన్న సబ్బం హరి అనూహ్యంగా ఈ రోజు ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచారు.  అంతేకాదు, ఎన్డియే కూటమికి తెలుగు దేశం పార్టీకి మద్దతును ప్రకటించారు.  

అనకాపల్లి సిట్టింగ్ ఎంపి సబ్బం హరి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపనలో ప్రముఖస్థానాన్ని వహించినవారు.  ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచి పార్టీని స్థాపించటానికి ఊతమిచ్చినవారు.  విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చెయ్యటానికి సిద్ధపడ్డవారు.  కానీ ఈరోజు, ఎన్నికలకు ఒకరోజు ముందుగా, ఆయన ఎన్నికలనుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు.  

అందుకు ఆయన చెప్పిన కారణం ఈ రోజు సుప్రీం కోర్టులో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ మీద విచారణను వాయిదా పడటమే కాకుండా జూన్ 2 న కేంద్ర ప్రభుత్వం చెయ్యనున్న తెలంగాణా ఆవిర్భావ ప్రకటన మీద కోరిన స్టే ని కూడా సుప్రీం కోర్టు తిరస్కరించటం.  ఈ పిటిషన్ మీద ఆగస్ట్ 20 కి విచారణను వాయిదా వెయ్యటంతో ఈ లోపులోనే రాష్ట్ర విభజన జరిగిపోతోంది కాబట్టి చెయ్యగలిగిందేమీ మిగలలేదని అర్థమైందని, ఏ కారణంతో పోటీ చేస్తున్నామో అది నెరవేరదని స్పష్టమైంది కాబట్టి ఉపసంహరించుకుంటున్నానని సబ్బం హరి మీడియా సమావేశంలో తెలియజేసారు.  

ఎన్నికలలో నామినేషన్ కి ముందు ఆహ్వానం వచ్చినా తాను తెలుగు దేశం పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీతో కాని కలవటానికి ఇష్టపడలేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికే పోరాడుతున్నాని చెప్పానని చెప్పిన సబ్బం హరి,  ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల కలయికకు మద్దతునిస్తానని బహిరంగంగా ప్రకటించారు.  విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే ఆ రెండు పార్టీల సమిష్టి కృషి అవసరమని అందుకు వాళ్ళని గెలిపించాలని వోటర్లను కోరారు.

విఖాఖపట్నంతో దాదాపు 30 సంవత్సరాల అనుబంధమున్న తనకు విశాఖ శ్రేయస్సు కంటే మరేమీ ఎక్కువ కాదని, అందువలన స్థానికేతరులు, ముఖ్యంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలాంటి అరాచకశక్తులు ఇక్కడ కాలుపెట్టటం ఇష్టం లేకనే తాను పోటీలో నిలబడ్డానని, అయితే సుప్రీం కోర్టు నిర్ణయంతో ఆ పని ఇక సాధ్యమయ్యే అవకాశం లేదని తేలిపోయిందని, అందువలన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్డియే, దానికి మద్దతునిస్తున్న తెదేపాలను గెలిపించటంలోనే విశాఖపట్నం సంక్షేమం ఉందని అభిప్రాయపడ్డానని సబ్బం హరి అన్నారు.  అలాంటప్పుడు తాను ఎన్నికలలో నిలబడి వోట్లు చీల్చటం సరికాదని కూడా తాను భావించినట్లుగా ఆయన చెప్పారు.  

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, తన తండ్రి వైయస్ స్థానమైన కడపను వదిలిపెట్టి తన తల్లి విజయమ్మను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తను అంచనా వెయ్యగలనని అన్న హరి, ఇక్కడ వేళ్ళూనినట్లయితే ఇక్కడి సంపదలు, జాగాలు, సముద్రం వలన పరిశ్రమల వలన కలిగే ప్రయోజనాలను కొల్లగొట్టవచ్చన్న ఆశతో వచ్చి ఇక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే అవకాశం ఉందని తాను భావిస్తూ అది జరగకుండా ఉండటం కోసమే ఎన్డియే కి మద్దతునివ్వమని కోరుతూ తాను ఉపసంహరించుకుంటున్నానని అన్నారాయన.  

హైద్రాబాద్ లో కెసిఆర్ జగన్ కి ఆస్కారమివ్వడు కాబట్టి విశాఖపట్నం మీద ఆయన కన్నువేసారని సబ్బం హరి ఆరోపించారు.  కానీ అటువంటి అరాచక శక్తులు విశాఖలోకి రాగూడదని, దానివలన రాష్ట్ర విభజన వలన కలిగిన నష్టం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉందని తను అభిప్రాయపడుతున్నానని అన్నారు.  

విశాఖను సింగపూర్ చేస్తామన్న తెదేపా మాటలనూ నమ్మటం లేదని, విశాఖను దేశంలోనే గొప్ప స్థానంగా మారుస్తామని అన్న విజయమ్మ మాటలనూ నమ్మటం లేదని, కానీ విశాఖ పట్నం సంస్కృతికి భంగం కలగకుండా దాన్ని అలా ఉంచితే చాలని, అదే వాళ్ళు చెయ్యగల గొప్ప మేలని అన్నారు సబ్బం హరి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles