First break in chennai bomb blasts investigation

First break in Chennai bomb blasts investigation, Chennai Central twin blasts, Bomb blast in Bangalore Guahati Express, Narendra Modi, CB CID investigating Chennai blasts

First break in Chennai bomb blasts investigation

చెన్నై బాంబు దాడిలో లభించిన మొదటి క్లూ!

Posted: 05/03/2014 09:32 AM IST
First break in chennai bomb blasts investigation

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆగివున్న బెంగళూరు గౌహాతి ఎక్స్ ప్రెస్ లో మేడే నాడు జరిగిన జంట పేలుళ్ళ కేసులో దర్యప్తు బృందాలకు మొదటి క్లూ దొరికింది.  అది రైలు రాగానే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి చిత్రం.  రైల్వే స్టేషన్లో సిసి కేమెరాలలో దొరికిన ఆ ఫోటోని శుక్రవారం పోలీసులు విడుదల చేసారు.  

బాంబు పేలుళ్లను దర్యాప్తు చేస్తున్న సిబి సిఐడి చెన్నైలో ఉపయోగించి బాంబులు, పాట్నాలో మోదీ ప్రసంగంలో పేలిన బాంబులకు దగ్గర పోలికలున్నాయని చెప్తున్నారు.  అక్టోబర్ 28, 2013 న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ పాట్నాలో నిర్వహించిన హుంకార్ ర్యాలీ లో మోదీ ఉపన్యాసానికి ముందుగా కొన్ని బాంబులు పేలాయి, కొన్నిటిని తర్వాత నిర్వీర్యం చేసారు.  

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బాంబు పేలిన కోచ్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.  వాటిలో వాచ్ భాగాలు, బ్యాటరీలు, లోహపు గొట్టం, లోహపు ముక్కలు కనిపించాయి.  టైమర్ ని ఉపయోగించి 90 నిమిషాలు లేటుగా నడుస్తున్న ఆ రైలు సరైన సమయంలో నడిచినట్లయితే అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించి ఉండేదని సిబి సిఐడి అధికారులు అన్నారు.  సరిగ్గా అదే రోజు నరేంద్ర మోదీ సీమాంధ్రలో ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్నారు. అందులో చెన్నైకి సమీపంలో ఉన్న నెల్లూరు కూడా ఉంది.  

సిసి టివి ఫుటేజ్ ని విడుదల చేసిన సిబిసిఐడి, రెండు ఫోన్ నంబర్లను కూడా ఇస్తూ అందులో కనిపించిన వ్యక్తి కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయని అతన్ని గురించి ఎవరిదగ్గరైనా ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ఆ వివరాలను తెలియజేయమని కోరారు.  ఆ ఫోన్ నంబర్లు- (044) 2250 2500/10 or (0)77086 54202.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles