Pawan kalyan direct criticizm in election campaigns

Pawan Kalyan direct criticizm in election campaigns, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Pawan Kalyan direct criticizm in election campaigns

పరోక్ష ధోరణి లేదు పవన్ ది ప్రత్యక్ష విమర్శలే!

Posted: 05/03/2014 08:53 AM IST
Pawan kalyan direct criticizm in election campaigns

రాజకీయాల్లోకి వస్తూనే దూకుడు గా వెళ్తున్న పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల మీద పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే పేరు పెట్టి విమర్శించటం చేస్తున్నారు.  తెలంగాణాలో ఎన్నికల ప్రచారంలో ఉన్నంతకాలం కెసిఆర్ మీద ధ్వజమెత్తారు.  ఎప్పుడూ ఎదుటివారిని తిట్టటమే కానీ తిట్టించుకోవటం ఎరుగని కెసిఆర్ దాన్ని తట్టుకోలేకపోయారన్నది ఆయన సభల్లో పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలతో అర్థమౌతోంది.  

సీమాంధ్ర వస్తూనే జగన్ మీద విరుచుకుపడ్డారాయన.  వైయస్ఆర్ సమయం నుంచే భూకబ్జాలు, అవినీతితో ఆస్తులను కూడగట్టటం జరిగిందని, దాన్ని జగన్ ఇంకా ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నాడని, నిజాలు చెప్తున్నందుకు తన కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దాడులు కూడా జరగవచ్చని అన్న పవన్ కళ్యాణ్ వేదాంత ధోరణిలో సోవియట్ సాహిత్యంలో తాను చదివిన ఈ కింది కథను ఎన్నికల ప్రచార సభలో చెప్పారు.

జాన్ అనే రాజు దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళి వ్యవసాయానికి కొంత భూమి కావాలని అడుగుతాడు.  అతనికి ఎంత భూమిని చూపించినా తృప్తిపడడతను.  సరిపోదనే అంటాడు.  అప్పుడా చక్రవర్తి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నువు ఎంత దూరం పరిగెడతావో అంత భూమి నీదేనని అంటాడు.  దానితో దురాశగల ఆ వ్యక్తి పరుగులు తీసి అలిసిపోతాడు కాని ఆగడు.  ఇంకొంచెం పరిగెడితే ఇంకా అది కూడా వస్తుంది కదా అని చివరి శ్వాస వరకు పరిగెడతాడు.  కుప్పకూలిన అతనికి చివరకు దక్కింది ఆరు అడుగుల భూమి మాత్రమే.

ఈ కథను పవన్ కళ్యాణ్ వైయస్ హయాంలో జరిగిన భూకబ్జాల గురించి చెప్తూ చెప్పారు.  దోపిడీలకు పాల్పడ్డవాళ్ళకి, భూకబ్జాలు చేసేవారికి చివరకు మిగిలేది ఆ కాస్త భూమే, పాతిపెట్టటానికి కావలసిన ఆరడుగుల జాగాయే అని పవన్ కళ్యాణ్ చెప్పారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles