Ahmed patel denies modi claims

Ahmed Patel denies Modi claims, Sonia Gandhi political secretary Ahmed Patel, Modi claims Ahmed Patel his friend

Ahmed Patel denies Modi claims as his friend

మోదీతో మిత్రభేదంలో అహ్మద్ పటేల్

Posted: 05/02/2014 12:46 PM IST
Ahmed patel denies modi claims

సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ని ఉద్దేశించి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన ఏకైక మంచి మిత్రుడని అన్న నరేంద్ర మోదీ మాటలను అహ్మద్ పటేల్ ఖండించారు.  

అహ్మద్ భాయ్ తనకి మంచి మిత్రుడని, కానీ దూర్ దర్శన్ లో తనతో జరిగిన ఇంటర్వ్యూలో తాను చేసిన కొన్ని మాటలను కత్తిరించటం జరగటంతో అతను తనకు దూరమయ్యాడని, అయితే తాను మాత్రం పూర్వ మైత్రిని కొనసాగించాలనే కోరుకుంటున్నానని, కానీ అహ్మద్ పటేల్ తనను తప్పించుకుంటూ తన ఫోన్ ని కూడా ఎత్తకుండా ఉంటున్నాడని మోదీ ఒక టివి ఇంటర్వ్యూలో అన్నారు.  

కానీ తను ఆయన స్నేహితుడినన్న మాట నిరాధారమైనది, అర్థరహితమైనదంటూ అహ్మద్ పటేల్ అన్నారు.  ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి ఇంతవరకు మోదీని కలిసిందే లేదంటూ చెప్పారు.  మోదీ, తన పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీనే భోజనానికి పిలవనివాడు, నన్నెలా పిలుస్తాంటూ అహ్మద్ పటేల్ వ్యంగ్యంగా మాట్లాడారు.  1980లో మోదీతో తను లంచ్ కి హాజరయ్యానని, అది కూడా రాజీవ్ గాంధీతో కలిసి అని అహ్మద్ పటేల్ చెప్పారు.  

ఎన్నికల సమయం కదా ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుంటారు.  కానీ నేను విషయ స్పష్టతకోసమే చెప్పేదేమిటంటే, మోదీతో కలిసి కనీసం కప్పు టీ కూడా తాగలేదు.  మోదీ మాటలు సత్యాలని ఆయన నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అహ్మద్ పటేల్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles