Air india joining star alliance group

Air India joining Star Alliance groupm, Star Alliance chain of Aircargo, Air India ready to join Star group, Air India Star Alliance joining from July

Air India joining Star Alliance group

స్టార్ తో ఎయిరిండియా పొత్తుకి రంగం సిద్ధం

Posted: 05/01/2014 01:02 PM IST
Air india joining star alliance group

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద వ్యాపార సంస్థైన స్టార్ ఎలియన్స్ తో భారతదేశం నుంచి మొదటిసారిగా ఎయిర్  ఇండియా విమానసంస్థ వ్యాపార భాగస్వామ్యానికి బాటలు వేస్తోంది.  జూన్ లో ఈ తతంగం పూర్తయ్యే అవకాశం.
ఎయిర్ ఇండియా సిఎమ్ డి రోహిత్ నందన్ మాట్లాడుతూ, స్టార్ తో వ్యాపార పొత్తుకి రంగం సిద్ధమైందని, ఐటి కి సంబంధించిన పనులు మాత్రమే మిగిలివున్నాయని, అవి కూడా మే నెలలోనే పూర్తవుతాయని అన్నారు. భారత దేశ విమాన సంస్థలకు ఈ ఒప్పందం వలన ఎంతో లాభం చేకూరుతుందని, ఒప్పందం జరిగిన తర్వాత మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా విస్తరించివున్న స్టార్ లాంజెస్ అందుబాటులోకి వస్తాయని, ఆయా దేశాలన్నిటితోనూ సంబంధం స్థాపితమౌతుందని అన్నారు.    
స్టార్ ఎలియన్స్ సిఇఓ మార్క్ ఎఫ్ స్క్వాబ్ మాట్లాడుతూ స్టార్ అనుబంధ సంస్థల సిఇవోలు కలిసి జూన్ 22, 23 న జరిగే సమావేశాలలో వారి సంస్థలలోకి ఎయిరిండియా ప్రవేశాన్ని గురించి చర్చించుకుంటారని అన్నారు.  ఆ తంతంతా పూర్తై జూలై నుంచి ఎయిర్ ఇండియా స్టార్ బృందం లోకి వచ్చేస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.  ఈ విషయంలో ఎయిర్ ఇండియా ముందుకెళ్తున్న విధానాన్ని కూడా ఆయన కొనియాడారు.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles